తెలంగాణ

telangana

ETV Bharat / state

ఇకపై ఆరు పేపర్లే, పదోతరగతి పరీక్షల్లో కీలకమార్పులు - పదో తరగతి పరీక్షలల్లో మార్పులు

పదో తరగతి పరీక్ష విధానంలో ఆంధ్రప్రదేశ్​ ప్రభుత్వం కీలక మార్పులు చేసింది. ఆ రాష్ట్రంలో సీబీఎస్​ఈ సిలబస్​కు అనుగుణంగా ఇకపై ఆరు పేపర్లు మాత్రమే ఉంటాయని విద్యాశాఖ కార్యదర్శి ఉత్తర్వులు జారీ చేశారు. విద్యార్థులపై ఒత్తిడి తగ్గించేందుకే ఈ విధానం తీసుకోస్తున్నామని ఆయన వివరణ ఇచ్చారు.

http://10.10.50.85:6060//finalout4/andhra-pradesh-nle/thumbnail/22-August-2022/16168775_213_16168775_1661172289494.png
http://10.10.50.85:6060//finalout4/andhra-pradesh-nle/thumbnail/22-August-2022/16168775_213_16168775_1661172289494.pnghttp://10.10.50.85:6060//finalout4/andhra-pradesh-nle/thumbnail/22-August-2022/16168775_213_16168775_1661172289494.png

By

Published : Aug 22, 2022, 10:34 PM IST

పదో తరగతి పరీక్ష విధానంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక మార్పులు చేసింది. ఇకపై పదో తరగతి పబ్లిక్‌ పరీక్షల్లో ఆరు పేపర్లు మాత్రమే నిర్వహించాలని నిర్ణయం తీసుకుంది. ఈ విధానాన్ని 2022-23 విద్యా సంవత్సరం నుంచి అమలు చేయాలని పేర్కొంటూ ఆ రాష్ట్ర విద్యాశాఖ కార్యదర్శి రాజశేఖర్ ఉత్తర్వులు జారీ చేశారు.

గతంలో పదో తరగతి పరీక్షల్లో 11 పేపర్లు ఉండగా కొవిడ్‌ కారణంగా 7 పేపర్లకు రాష్ట్ర ప్రభుత్వం కుదించింది. సీబీఎస్‌ఈ సిలబస్‌కు అనుగుణంగా ఆరు సబ్జెక్టులకు ఆరు పేపర్లు మాత్రమే ఉండేలా ఫిజికల్‌ సైన్స్‌, బయోలజికల్‌ సైన్స్‌ను కలిపి ఒకే పేపర్‌గా నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు. విద్యార్థులపై ఒత్తిడి తగ్గించేందుకే కొత్త విధానాన్ని తీసుకొచ్చినట్లు విద్యాశాఖ ఉత్తర్వుల్లో పేర్కొంది. ఏడాది పొడవునా వివిధ పరీక్షలు నిర్వహిస్తుడడంతో 11 పరీక్షలు అవసరం లేదని ప్రభుత్వం భావించినట్లు ఉత్తర్వుల్లో తెలిపింది.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details