ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు జగనన్న అమ్మఒడి, వసతి దీవెన పథకాలకు బదులుగా ఏపీ ప్రభుత్వం ల్యాప్‌టాప్‌లు పంపిణీ చేయనుంది. ల్యాప్‌టాప్‌ల కొనుగోలుకు టెండరు నోటీస్ జారీ చేయాలని నిర్ణయించింది. టెండరు విలువ వంద కోట్ల రూపాయల పరిమితి దాటడంతో న్యాయసమీక్షకు పంపించింది. బేసిక్ కాన్ఫిగరేషన్‌తో 5.62 లక్షల ల్యాప్‌టాప్‌లు, ఆధునిక కాన్ఫిగరేషన్‌తో 90,926 ల్యాప్‌టాప్‌ల కొనుగోలుకు టెండర్లు పిలవనున్నారు. సరఫరా కోసం బిడ్లు దాఖలు చేయాల్సిందిగా ఏపీ టెక్నాలజీ సర్వీసెస్ కోరింది.
ammavadi: జగనన్న అమ్మఒడి, వసతి దీవెన పథకాలకు బదులుగా ల్యాప్‌టాప్‌లు - ap news
జగనన్న అమ్మఒడి, వసతి దీవెన పథకాలకు బదులుగా ఏపీ ప్రభుత్వం ల్యాప్‌టాప్‌లు పంపిణీ చేయనుంది. ల్యాప్‌టాప్‌ల కొనుగోలుకు టెండరు నోటీస్ జారీ చేయాలని నిర్ణయించింది.
ammaodi
దీనిపై అభ్యంతరాలు, సూచనలు, సలహాలు తెలియచేయాల్సిందిగా ప్రజలను కోరుతూ ప్రకటన విడుదల చేసింది. సెప్టెంబరు 17 సాయంత్రం 5 గంటల్లోగా ఏపీజ్యూడీషియల్ ప్రివ్యూ ఎట్ జీమెయిల్ డాట్ కామ్‌కు ఈ అభ్యంతరాలు, సూచనలు సలహాలు పంపాలని ప్రభుత్వం స్పష్టం చేసింది.
ఇదీ చూడండి:'అమ్మఒడి' పేద విద్యార్థులకు శ్రీరామరక్ష: సీఎం జగన్