తెలంగాణ

telangana

ETV Bharat / state

మద్యం ఉత్పత్తికి ఏపీ ప్రభుత్వం అనుమతి - ఏపీ లాక్​డౌన్ వార్తలు

ఏపీలో మద్యం ఉత్పత్తికి ప్రభుత్వం అనుమతినిచ్చింది. కార్మికులు భౌతిక దూరం పాటించేలా చూడాలని సదరు కంపెనీలను ఆదేశించింది. లాక్​డౌన్​ సండలింపుల్లో భాగంగా గ్రీన్​ జోన్లలో మద్యం దుకాణాలకు కేంద్ర ప్రభుత్వం అనుమతినిచ్చిన నేపథ్యంలో జగన్ సర్కార్ ఈ నిర్ణయం తీసుకుంది.

ap govt
మద్యం ఉత్పత్తికి ఏపీ ప్రభుత్వం అనుమతి

By

Published : May 3, 2020, 8:57 AM IST

కేంద్ర మార్గదర్శకాలకు అనుగుణంగా ఏపీలో మద్యం ఉత్పత్తికి ప్రభుత్వం అనుమతిచ్చింది. ఈ క్రమంలో ఆదివారం నుంచి 20 డిస్టిలరీలు తెరుచుకోనున్నాయి. వాటికి కొన్ని మార్గదర్శకాలను సర్కారు విడుదల చేసింది. మద్యం తయారీ కంపెనీలను పూర్తిగా శానిజైట్ చేయాలని స్పష్టం చేసింది. మద్యం తయారీ సమయాల్లో కార్మికులు భౌతికదూరం పాటించడం తప్పనిసరని చెప్పింది. కంపెనీల్లో ఎంట్రీ, ఎగ్జిట్‌ గేట్లు వేర్వేరుగా ఉండాలని సూచించింది. గుట్కా, సిగరెట్‌ నిషేధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అలాగే కంపెనీల్లో కార్మికులు లిఫ్టులు ఉపయోగించవద్దని ప్రభుత్వం ఆదేశించింది.

ABOUT THE AUTHOR

...view details