శ్రీశైలం జలాల ఆధారంగా ఏపీ ప్రభుత్వం నిర్మించ తలపెట్టిన రాయలసీమ ఎత్తిపోతల పథకం టెండర్లు సహా ఇతర పనులకు సంబంధించి చెన్నై హరిత ట్రైబ్యునల్ ఇచ్చిన ఆదేశాల తాలూకు మధ్యంతర ఉత్తర్వుల పత్రాలను మంగళవారం రాష్ట్ర జలవనరుల శాఖ కృష్ణా బోర్డుకు సమర్పించింది.
కృష్ణా బోర్డుకు వివరాలు సమర్పించిన ఏపీ జలవనరుల శాఖ - ap governament go 203 news
ఆంధ్రప్రదేశ్‌లోని రాయలసీమ ఎత్తిపోతల పథకానికి సంబంధించి ఎన్జీటీ ఇచ్చిన ఆదేశాల తాలూకు మధ్యంతర ఉత్తర్వుల పత్రాలను ఏపీ జలవనరుల శాఖ కృష్ణా బోర్డుకు సమర్పించింది.
కృష్ణా బోర్డుకు వివరాలను సమర్పించిన ఏపీ జలవనరుల శాఖ
ఈ ఎత్తిపోతల నిర్మాణంపై కొందరు హరిత ట్రైబ్యునల్‌ను ఆశ్రయించగా, తెలంగాణ రాష్ట్రం దీనిపై కృష్ణా బోర్డుకు ఫిర్యాదు చేసింది. నిర్మాణ ప్రక్రియలకు సంబంధించిన పనులు మినహా టెండర్లు తదితరాలు పూర్తిచేసుకునేలా ట్రైబ్యునల్ స్పష్టత ఇచ్చిందని ఏపీ ప్రభుత్వం బోర్డుకు ఇప్పటికే వివరించింది.
ఇదీ చదవండి:వైద్యారోగ్య శాఖలో ఖాళీలను రెగ్యులర్ విధానంలో భర్తీ చేయాలి'