చినజీయర్ స్వామి చేపట్టిన ప్రజా ఉద్యమంలో తాను కూడా భాగస్వామ్యం వహిస్తానని ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అన్నారు. హైదరాబాద్ నగర శివారు శంషాబాద్ మండలంలోని ముచ్చింతలలో ఐదవరోజూ నిర్వహించిన చినజీయర్ స్వామి పుట్టినరోజు వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. చినజీయర్ స్వామి చేసిన మంగళ శాసనాలను ప్రతి ఒక్కరు తమ జీవితంలో ఉపయోగించుకోవాలని చంద్రబాబు కోరారు. పెదజీయర్ స్వామి చేపట్టిన ఉద్యమం తమిళనాడులో ఇప్పటికీ కొనసాగుతోందని ఆయన గుర్తుచేశారు.
"చినజీయర్ స్వామి ప్రజా ఉద్యమం ఆదర్శనీయం" - ముచ్చింతల
హైదరాబాద్ నగర శివారులోని ముచ్చింతలలో చినజీయర్ స్వామి పుట్టినరోజు వేడుకలు ఐదవరోజు ఘనంగా నిర్వహించారు. వేడుకల్లో ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు.
చినజీయర్ స్వామి పుట్టినరోజు వేడుకల్లో మాజీ ముఖ్యమంత్రి