తెలంగాణ

telangana

ETV Bharat / state

ఏపీ అధికారికి తప్పిన ప్రమాదం - కారు దగ్ధం

ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖ అసిస్టెంట్​ కమిషనర్​ రాణాప్రతాప్​ కుటుంబంతో సహా హైదరాబాద్​లో వివాహ వేడుకకు హాజరయ్యారు. తిరుగు ప్రయాణంలో వారు ప్రయాణిస్తున్న కారులో మంటలు చెలరేగాయి. ఆయన అప్రమత్తతతో పెనుప్రమాదం తప్పింది.

కారు దగ్ధం

By

Published : Mar 11, 2019, 8:58 AM IST

మంటల్లో దగ్ధమవుతున్న కారు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్​కు తృటిలో పెను ప్రమాదం తప్పింది. హైదరాబాద్​ మాదాపూర్​లో ఓ వివాహ వేడుకకు హాజరై తిరిగి వెళ్తున్న సమయంలో ఆయన ప్రయాణిస్తున్న కారులో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. గమనించిన కమిషనర్​ రాణాప్రతాప్​ కారును నిలిపేశారు.

కారు దగ్ధం

కమిషనర్​ అగ్నిమాపక సిబ్బందికి సమాచారమిచ్చారు. వారు ఘటనా స్థలానికి చేరుకునే లోపే కారు పూర్తిగా దగ్ధమైంది. ప్రమాద సమయంలో కారులో కమిషనర్, ఆయన​ భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఎవరికీ ఎలాంటి గాయాలు కాకపోవడం వల్ల ఊపిరి పీల్చుకున్నారు. రాయదుర్గం పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

ఇవీ చూడండి :నేడు తెరుచుకోనున్న శబరిమల ఆలయం

ABOUT THE AUTHOR

...view details