రేపటి నుంచి ఏపీ ఎంసెట్ ప్రవేశ పరీక్ష ప్రారంభం కానుంది. ఈ మేరకు తెలుగు రాష్ట్రాల్లో 118 ప్రవేశ పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు. రెండు విడుతలుగా ఏడు రోజులపాటు ఆన్‌లైన్‌లో ప్రవేశ పరీక్షలు నిర్వహించనున్నారు.
రేపటి నుంచే ఏపీ ఎంసెట్.. విస్తృతంగా ఏర్పాట్లు - ఏపీ ఎంసెట్ వార్తలు
గురువారం నుంచి ఏపీ ఎంసెట్ ప్రారంభం కానుంది. ఏపీ, తెలంగాణలో కలిపి 118 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు ప్రవేశ పరీక్షల ప్రత్యేకాధికారి సుధీర్ రెడ్డి తెలిపారు.

రేపటి నుంచే ఏపీ ఎంసెట్.. విస్తృతంగా ఏర్పాట్లు
ఇంజినీరింగ్‌కు 1,85,263 మంది, వ్యవసాయ, వైద్యవిద్యకు 87,637మంది దరఖాస్తులు చేసుకున్నారు. ప్రవేశపరీక్ష కేంద్రాల వద్ద ఒక్క నిమిషం నిబంధన అమలు చేస్తున్నట్లు ప్రత్యేక అధికారి సుధీర్ రెడ్డి తెలిపారు. గంటన్నర ముందు నుంచే పరీక్ష కేంద్రాల్లోకి అనుమతి ఇస్తామని చెప్పారు.
ఇదీ చదవండి:నేటినుంచి చివరి సెమిస్టర్ పరీక్షలు.. 4 వారాల పాటు కొనసాగింపు