తెలంగాణ

telangana

ETV Bharat / state

ఏపీలో ఉమ్మడి ప్రవేశ పరీక్షలకు దరఖాస్తు గడువు పెంపు

ఆంధ్రప్రదేశ్​లో ఎంసెట్‌ సహా నాలుగు ఉమ్మడి ప్రవేశ పరీక్షలకు దరఖాస్తు గడువు పెంచారు. అపరాధ రుసుముతో గడువును పొడిగిస్తూ ఉన్నత విద్యా మండలి ప్రకటన విడుదల చేసింది. కొవిడ్ కారణంగా దరఖాస్తు చేసుకోలేకపోయిన వారికి వీలుగా ఈ నిర్ణయం తీసుకునట్లు పేర్కొంది.

By

Published : Sep 14, 2020, 7:51 AM IST

ap-emcet-application-deadline-has-been-extended
ఏపీలో ఉమ్మడి ప్రవేశ పరీక్షలకు దరఖాస్తు గడువు పెంపు

ఏపీలో ఎంసెట్‌ సహా మరో నాలుగు ఉమ్మడి ప్రవేశ పరీక్షలకు అపరాధ రుసుముతో దరఖాస్తు చేసుకునేందుకు గడువును పొడిగిస్తూ ఉన్నత విద్యా మండలి ప్రకటన విడుదల చేసింది. కరోనా కారణంగా దరఖాస్తు చేసుకోలేకపోయిన విద్యార్థులకు అవకాశం కల్పించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది.

ఎస్‌డబ్ల్యూ-3 కింద ప్రత్యేక పరీక్ష ద్వారా ప్రవేశాలు నిర్వహించేందుకు కళాశాలలు రిజిస్ట్రేషన్‌ చేసుకోవాలని సూచించింది. వాటికి ఎంసెట్‌తో సంబంధం లేకుండా ఉన్నత విద్య నియంత్రణ, పర్యవేక్షణ కమిషన్‌ ప్రత్యేకంగా పరీక్ష నిర్వహించనుంది.

ఇదీ చదవండి:'77 ఏళ్ల వయసులో లా ఎందుకు చదవకూడదు?'

ABOUT THE AUTHOR

...view details