ఓట్ల లెక్కింపు ప్రక్రియను తప్పనిసరిగా వీడియో తీయాలని ఆంధ్రప్రదేశ్ ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. సమస్యాత్మక, అతి సమస్యాత్మక ప్రాంతాల్లో వీడియో తీయాలని ఆదేశించింది. ఈ మేరకు కలెక్టర్లకు ఎస్‌ఈసీ అదనపు మార్గదర్శకాలు ఇచ్చారు.
'ఓట్ల లెక్కింపును.. తప్పనిసరిగా వీడియో తీయాలి'
ఆంధ్రప్రదేశ్‌లో నాలుగో విడత పంచాయతీ ఎన్నికలకు సంబంధించి ఆ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ అదనపు మార్గదర్శకాలు జారీ చేశారు. ఓట్ల లెక్కింపు ప్రక్రియను తప్పనిసరిగా వీడియో తీయాలని స్పష్టం చేశారు.
'ఓట్ల లెక్కింపును.. తప్పనిసరిగా వీడియో తీయాలి'
ఓట్ల లెక్కింపు వేళ విద్యుత్ సరఫరాలో అంతరాయం లేకుండా చూడాలని.. జనరేటర్లు, ఇన్వర్టర్లు వంటివి ఏర్పాటు చేసుకోవాలని తెలిపారు. ఇతరులను లెక్కింపు కేంద్రాల్లోకి అనుమతించవద్దని స్పష్టం చేశారు. పదిలోపు ఓట్ల తేడా ఉన్నచోటే రీకౌంటింగ్‌కు ఆదేశించాలన్న ఎస్‌ఈసీ.. ఓట్ల లెక్కింపు వేళ సమాచారం లీక్ కాకుండా చూడాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. లెక్కింపు కేంద్రాల్లో వీడియో ఫుటేజీ భద్రపర్చాలని వివరించారు.
- ఇదీ చూడండి :న్యాయవాదుల హత్యను సుమోటోగా స్వీకరించిన హైకోర్టు