ఆంధ్రప్రదేశ్‌లో వైరస్ ఉద్ధృతి కొనసాగుతోంది. ఆ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అంజాద్ బాషాకు కరోనా వైరస్ సోకినట్లు వైద్యులు గుర్తించారు. ఆయన భార్య, కుమార్తెకు సైతం కరోనా సోకినట్లు నిర్ధరించారు.
ఆ రాష్ట్ర ఉపముఖ్యమంత్రికి కరోనా పాజిటివ్ - ఉప ముఖ్యమంత్రి అంజాద్ బాషా
ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి అంజాద్ బాషాతో పాటు ఆయన భార్య, కుమార్తెకు కరోనా వైరస్ నిర్ధరణ అయింది. వైద్య పరీక్షల్లో పాజిటివ్‌గా తేలడంతో తిరుపతి స్విమ్స్‌కు తరలించారు. ప్రస్తుతం వారి ఆరోగ్య పరిస్థితి బాగానే ఉందని వైద్యులు వెల్లడించారు.
ఆ రాష్ట్ర ఉపముఖ్యమంత్రికి కరోనా పాజిటివ్
కడప జిల్లాలో నిర్వహించిన పరీక్షల్లో పాజిటివ్‌గా తేలగా... శుక్రవారం రాత్రి 1 గంటకు వారు తిరుపతిలోని రాష్ట్ర కొవిడ్ ఆసుపత్రికి (స్విమ్స్) చేరుకున్నారు. ముగ్గురికి ప్రత్యేక గదిని కేటాయించి వైద్యం అందించారు. ప్రస్తుతం వారి ఆరోగ్య పరిస్థితి బాగుందని స్విమ్స్ సంచాలకురాలు భూమా వెంగమ్మ వెల్లడించారు. ఆదివారం సాయంత్రం వారిని హైదరాబాద్‌లోని ఆసుపత్రికి తరలించినట్లు పేర్కొన్నారు.
ఇదీ చదవండి:కరోనా వస్తే ఆందోళన వద్దు.. ఖర్చేమీ లేకుండానే కోలుకున్నాం