ఏపీ గత 24 గంటల్లో 79,601 శాంపిళ్లను పరీక్షించగా.. 2,410 కొత్త కొవిడ్ కేసులు నమోదయ్యాయి. 2,452 మంది కోలుకుని ఇంటికి వెళ్లగా.. వివిధ జిల్లాల్లో 11 మంది మరణించారు. తూర్పు గోదావరి జిల్లాలో అత్యధికంగా 401, కర్నూలులో అత్యల్పంగా 23 మందికి కరోనా నిర్ధారణ అయింది.
జిల్లాల వారీగా...
గుంటూరు జిల్లాలో 323, కృష్ణా పశ్చిమ గోదావరిలో 298 చొప్పున, చిత్తూరులో 253 మంది గడచిన 24 గంటల్లో కరోనా బారిన పడ్డారు. అనంతపురంలో 161, విశాఖపట్టణంలో 142, కడపలో 132, నెల్లూరులో 121, ప్రకాశంలో 108, విజయనగరంలో 79, శ్రీకాకుళంలో 71 చొప్పున కొత్త కేసులు బయటపడ్డాయి.