తెలంగాణ

telangana

ETV Bharat / state

ఏపీలో 1332కు చేరిన కరోనా కేసుల సంఖ్య - ఏపీ కరనా వైరస్ వార్తలు

ఆంధ్రప్రదేశ్​లో కరోనా కేసుల సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది. తాజాగా ఇవాళ 73 మందికి వైరస్ సోకినట్లు ఆ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ హెల్త్ బులెటిన్ విడుదల చేసింది. మొత్తం కేసుల సంఖ్య 1332కు చేరింది.

Ap corona cases reached to 1332
ఏపీలో 1332కు చేరిన కరోనా కేసుల సంఖ్య

By

Published : Apr 29, 2020, 11:52 AM IST

ఏపీలో ఇవాళ కొత్తగా 73 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వీటితో కలిపి మొత్తం కేసుల సంఖ్య 1,332కు చేరిందని ఆ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ హెల్త్ బులెటిన్​ విడుదల చేసింది. వైరస్ నుంచి కోలుకుని 287 మంది డిశ్చార్జయ్యారని తెలిపింది. 1,014 మంది కరోనా బాధితులు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారని పేర్కొంది. గడిచిన 24 గంటల్లో 7,727 నమూనాలు పరీక్షించగా... 73 మంది పాజిటివ్ నిర్ధరణ అయ్యాయని ప్రకటించింది.

జిల్లాల్లో కొత్త కేసులు

గుంటూరు జిల్లాలో కొత్తగా 29 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదవ్వగా, కృష్ణా జిల్లాలో 13, కర్నూలు జిల్లాలో 11 మందికి కరోనా సోకింది. ప్రకాశం, కడప, అనంతపురం జిల్లాల్లో 4 చొప్పున కొవిడ్ కేసులు నమోదయ్యాయని వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది. చిత్తూరు జిల్లాలో 3, పశ్చిమ గోదావరిలో 2, విశాఖ, శ్రీకాకుళం, తూర్పు గోదావరి జిల్లాలో ఒక్కొక్కరి కరోనా సోకింది.

ఏపీలో 1332కు చేరిన కరోనా కేసుల సంఖ్య

ఇవీ చూడండి: తెలంగాణలో మరో ఆరుగురికి కరోనా.. 1009కి చేరిన కేసులు

ABOUT THE AUTHOR

...view details