ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా విజృంభిస్తోంది. గడచిన 24 గంటల్లో కొత్తగా 58 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని ఆ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ హెల్త్ బులెటిన్లో ప్రకటించింది. కొత్త కేసులతో కలిపి.. కరోనా బారిన పడిన వారి సంఖ్య 1,583కు చేరిందని తెలిపింది. 488 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారని పేర్కొంది. రాష్ట్రంలోని వివిధ ఆస్పత్రుల్లో 1,062 మంది కరోనా బాధితులు చికిత్స పొందుతున్నట్లు వెల్లడించింది. గడచిన 24 గంటల్లో 6,534 నమూనాలు పరీక్షించగా... 58 మందికి పాజిటివ్ వచ్చిందని వైద్య ఆరోగ్యశాఖ ప్రకటించింది.
ఏపీలో కొత్తగా 58 కరోనా కేసులు
ఆంధ్రప్రదేశ్లో గడచిన 24 గంటల్లో 58 కరోనా కేసులు నమోదయ్యాయని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది.
ఏపీలో కొత్తగా 58 కరోనా కేసులు
జిల్లాల వారీగా కొత్త కేసులు
- కర్నూలు జిల్లాలో 30 కరోనా పాజిటివ్ కేసులు
- గుంటూరు జిల్లాలో 11 కేసులు
- కృష్ణా జిల్లాలో 8 కేసులు
- అనంతపురం జిల్లాలో 7 కేసులు
- చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లో ఒక్కో కరోనా కేసు నమోదు
ఇవీ చూడండి: కరోనాపై పోరుకు కృతజ్ఞతగా యోధులపై పూలవర్షం