ఏపీలో కరోనా ఉద్ధృతి తగ్గుతోంది. ఆదివారం కొత్తగా 5వేల 210 కేసులు, 30 మరణాలు నమోదైనట్లు వైద్యఆరోగ్యశాఖ తెలిపింది. తాజా కేసులతో కలిపి... ఏపీలో మొత్తం కొవిడ్ బాధితుల సంఖ్య 7లక్షల 55వేల 727కు చేరింది. 24 గంటల వ్యవధిలో కరోనా నుంచి 5 వేల 509 మంది కోలుకోగా.. ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పటివరకూ 7 లక్షల3 వేల 208 మంది బాధితులు వైరస్‌ను జయించారు.
ఏపీలో కొత్తగా 5,210 కరోనా కేసులు నమోదు - ap news
ఏపీలో కరోనా ఉద్ధృతి క్రమంగా తగ్గుతోంది. కొత్తగా 5వేల210 మందికి వైరస్ నిర్ధరణ అయింది. వైరస్‌తో మరో 30 మంది మరణించారు. రాష్ట్రంలో మొత్తం కేసులు 7లక్షల 55వేల727కు చేరాయి. ఇప్పటివరకు కరోనా నుంచి 7లక్షల 3వేల 208 మంది బాధితులు కోలుకున్నారు. వైరస్‌తో ఇప్పటివరకు 6వేల224 మరణాలు సంభవించాయి.
ఏపీలో కొత్తగా 5,210 కరోనా కేసులు నమోదు
కరోనాతో ఇప్పటివరకు 6వేల 224 మంది మృతిచెందారని వైద్యఆరోగ్యశాఖ తెలిపింది. ప్రస్తుతం.... 46వేల 295 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నట్లు వివరించింది. 24 గంటల వ్యవధిలో 75,517మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా.. మెుత్తం వైరస్ నిర్ధరణ పరీక్షలు 65,69,616 మందికి జరిగాయి.