Jagan Review Meeting with Collectors: కలెక్టర్లూ ప్రెస్‌మీట్లు పెట్టండి..గట్టిగా తిట్టండి..! ఈ మాట చెప్పింది ఎవరో కాదు! సాక్షాత్తూ ఏపీ ముఖ్యమంత్రి వర్యులే.! వివిధ కారణాలతో గతంలో సంక్షేమ పథకాలు అందని 2లక్షల 79 వేల మంది లబ్ధిదారులకు.... 590 కోట్ల 91లక్షల రూపాయలను వారి ఖాతాల్లో జమ చేశారు జగన్.! ఈ సందర్భంగా పింఛన్ల తొలగింపు అంశాన్ని ప్రస్తావించారు. పింఛన్ల తొలగింపుపై నోటీసులు ఇస్తే తప్పేంటని ప్రశ్నించారు. అర్హత ఉన్న ఏ ఒక్కరి పింఛన్ తీసేయడానికి వీల్లేదన్న జగన్.. ఒకవేళ ఎవరైనా దుష్ప్రచారం చేస్తే.. కలెక్టర్లు గట్టిగా తిట్టిపోయాలని.. ఆదేశించారు.
ప్రెస్‌మీట్లు పెట్టండి.. గట్టిగా తిట్టండి..: జగన్ - కలెక్టర్లు గట్టిగా తిట్టిపోయాలన్న జగన్
CM YS Jagan Review Meeting: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి మరోసారి విపక్షాలపై ఘాటుగా స్పందించారు. అర్హత ఉన్న ఏ ఒక్కరి పింఛన్ తీసేయడానికి వీల్లేదన్న జగన్.. ఒకవేళ ఎవరైనా దుష్ప్రచారం చేస్తే.. కలెక్టర్లు గట్టిగా తిట్టిపోయాలని.. ఆదేశించారు.
ప్రెస్‌మీట్లు పెట్టండి.. గట్టిగా తిట్టండి..!: జగన్
‘ఏ మంచిపని చేసినా వక్రీకరిస్తున్నారు. ప్రతిదీ పాజిటివ్‌గానే తీసుకుందాం. ఆరోపణల్లో నిజం ఉంటే కరెక్ట్ చేసుకుందాం. అందులో వాస్తవం లేకపోతే ప్రెస్‌మీట్ పెట్టి గట్టిగా తిట్టండి. అలా చేస్తే వాళ్ల తప్పు మనం ఎత్తి చూపినట్లు అవుతుంది. మన తప్పు ఉంటే సరిదిద్దుకుందాం. అందులో తప్పు కూడా లేదు. అలా చేయకపోతే ప్రజల్లోకి రాంగ్ మెసేజ్ పోతుంది. మనం ప్రజా సేవకులం. పాలన అంటే సేవ అనే విషయాన్ని ప్రతి కలెక్టర్ గుర్తుపెట్టుకోవాలి’- ఏపీసీఎం జగన్
ఇవీ చదవండి: