ఏపీ సీఎంతో భేటీని స్వాగతిస్తున్నాను: పొంగులేటి
పోలవరం ముంపు, ప్రతికూల ప్రభావాలపై అధ్యయనాలు చేయాలని సీఎం కేసీఆర్కు మాజీ ఎమ్మెల్సీ, భాజపా కోర్ కమిటీ సభ్యుడు పొంగులేటి సుధాకర్ రెడ్డి లేఖ రాశారు. అంతరాష్ట్ర వివాదాలపై ఏపీ ముఖ్యమంత్రితో సీఎం కేసీఆర్ భేటీని స్వాగతిస్తున్నానని ఆయన పేర్కొన్నారు.
అంతరాష్ట్ర వివాదాలపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డితో కేసీఆర్ సమావేశాన్ని స్వాగతిస్తున్నానని మాజీ ఎమ్మెల్సీ, భాజపా కోర్ కమిటీ సభ్యుడు పొంగులేటి సుధాకర్ రెడ్డి అన్నారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం వల్ల భద్రాచలం సీతారామస్వామి ఆలయం, సింగరేని బొగ్గు గనులకు కలిగే ముంపు కష్టాలపై ఆయన ముఖ్యమంత్రి కేసీఆర్కు లేఖ రాశారు. పురుషోత్తం పట్నం, కన్నయగూడెం, యేటపాక, గుండాలా, పిచుకలపాడు వంటి 5 గ్రామాలు పోలవరం ప్రాజెక్టు కింద మునిగిపోయే గ్రామాలు కాదని... ఆలయం యొక్క ఆస్తులు ఆ గ్రామాల్లో ఉన్నాయని... వారంతా భద్రాచలంతో మానసికంగా సంబంధం కలిగి ఉన్నారని లేఖలో పేర్కొన్నారు. బాధ్యతాయుతమైన వ్యక్తిగా తాను... పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి వ్యతిరేకం కాదని... ముంపు, ప్రతికూల ప్రభావాలపై మాత్రం అధ్యయనాలు చేయాల్సిన అవసరం ఉందని లేఖలో పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిని కలుస్తున్నందున, పైన పేర్కొన్న సమస్యలను జగన్ దృష్టికి తీసుకోవెళ్లాలని పొంగులేటి సుధాకర్ రెడ్డి విజ్ణప్తి చేశారు.
ఇదీచూడండి:'104 సిబ్బంది సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం ఘోరంగా విఫలమైంది'