తెలంగాణ

telangana

ETV Bharat / state

పరిపాలన అంటే ఏంటో చూపించగలిగాం: జగన్‌

వాలంటీర్ల వ్యవస్థతో ఏపీలో పరిపాలన అంటే ఏంటో చూపించగలిగామని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ అన్నారు. అత్యుత్తమ సేవలందించిన గ్రామ, వార్డు వాలంటీర్లకు సత్కార కార్యక్రమంలో పాల్గొన్న జగన్.. వారి సేవలపై ప్రశంసలు గుప్పించారు. ప్రతి ఏటా వాలంటీర్లకు సత్కారం కార్యక్రమం ఉంటుందని చెప్పారు.

cm jagan
పరిపాలన అంటే ఏంటో చూపించగలిగాం: జగన్

By

Published : Apr 12, 2021, 1:57 PM IST

అత్యుత్తమ సేవలందించిన గ్రామ, వార్డు వాలంటీర్లను ఏపీ ప్రభుత్వం సత్కరించింది. కృష్ణా జిల్లా పెనమలూరు మండలం పోరంకిలో సేవా మిత్ర, సేవా రత్న, సేవా వజ్ర పురస్కారాలను.. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్.. గ్రామ, వార్లు వాలంటీర్లకు ప్రదానం చేశారు. వాలంటీర్ల వ్యవస్థ ద్వారా రాష్ట్రంలో పరిపాలన అంటే ఏంటో చూపించగలిగామని ఈ సందర్భంగా జగన్ చెప్పారు. కులాలు, మతాలు చూడకుండా నిస్వార్థంగా పనిచేస్తున్నారని ప్రశంసించారు. విమర్శలకు బెదరకుండా పనిచేయాలని.. వాలంటీర్లకు ఏపీ ప్రభుత్వం అండగా ఉంటుందని స్పష్టం చేశారు.

'దాదాపు 20 నెలల క్రితం వాలంటీర్ల వ్యవస్థను తీసుకొచ్చాం. ఏపీలో పరిపాలన అంటే ఏంటో చూపించగలిగాం. పథకాలకు రాష్ట్రంలో గ్రామగ్రామాన సంధానకర్తలుగా ఉన్నారు. కులాలు, మతాలు చూడకుండా నిస్వార్థంగా పనిచేస్తున్నారు. ప్రతి 50 ఇళ్లకు ఒక వాలంటీర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చాం. వాలంటీర్లలో 53 శాతం మంది మహిళలు ఉన్నారు. ఏటా వాలంటీర్లకు సత్కారం కార్యక్రమం ఉంటుంది. ఎల్లుండి నుంచి రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో అవార్డు ప్రదాన కార్యక్రమం కొనసాగుతుంది'- ఏపీ ముఖ్యమంత్రి జగన్

ABOUT THE AUTHOR

...view details