తెలంగాణ

telangana

By

Published : Jul 8, 2020, 7:03 PM IST

ETV Bharat / state

'సున్నా వడ్డీ పథకంపై బకాయిలను సున్నా చేస్తున్నాం'

సున్నా వడ్డీ పథకం కింద నగదును ఇకపై నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేస్తామని ఆంధ్రప్రదేశ్​ సీఎం జగన్‌ చెప్పారు. 57 లక్షల మంది రైతుల ఖాతాల్లో డబ్బులు వేస్తామన్నారు. నాలుగైదు రోజులు ఆలస్యమైనా రైతులు కంగారుపడవద్దని తెలిపారు.

'సున్నా వడ్డీ పథకంపై బకాయిలను సున్నా చేస్తున్నాం'
'సున్నా వడ్డీ పథకంపై బకాయిలను సున్నా చేస్తున్నాం'

సున్నావడ్డీ పథకం కింద నగదును ఇకపై నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేస్తామని ఏపీ సీఎం జగన్‌ అన్నారు. ఉచిత విద్యుత్ రూపంలో ఒక్కో రైతుకు ఏటా 50 వేల రూపాయల లాభం చేకూరుతుందని రైతు దినోత్సవ కార్యక్రమంలో జగన్‌ తెలిపారు. బోధనా ఫీజుల చెల్లింపు, జలయజ్ఞం అంటే వైఎస్సారే గుర్తుకొస్తారని చెప్పారు.

'ఉచిత విద్యుత్ రూపంలో ఒక్కో రైతుకు ఏటా రూ.50 వేలు లాభం చేకూరుతుంది. రైతుకు మేలు చేకూర్చిన మొదటి నేత వైఎస్‌ఆర్‌. ఉచిత విద్యుత్‌ను గతంలో అనేకమంది నేతలు ఎగతాళి చేశారు. 104, 108 వాహనాలను తెచ్చింది వైఎస్‌ఆర్‌. బోధన ఫీజుల చెల్లింపు, జలయజ్ఞం అంటే వైఎస్‌ఆర్ గుర్తుకొస్తారు. సున్నా వడ్డీ పథకంపై బకాయిలను సున్నా చేస్తున్నాం. ఇకనుంచి సున్నా వడ్డీ మొత్తం నేరుగా రైతుల ఖాతాల్లోనే జమ చేస్తాం' - సీఎం జగన్

ఈ అక్టోబరులోగా నిధులను రైతుల ఖాతాల్లో జమ చేస్తామని సీఎం తెలిపారు. తాడేపల్లిలోని తన క్యాంపు కార్యాలయం నుంచి ఆయన ఈ మేరకు సమీక్షించారు. నేరుగా రైతుల ఖాతాల్లో జమ చేయడం అన్నది గతంలో ఎప్పుడూ లేదని ముఖ్యమంత్రి చెప్పారు. 57 లక్షల మంది రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేస్తామన్నారు. నాలుగైదు రోజులు ఆలస్యమైనా రైతులు కంగారుపడ వద్దని కోరారు.

ఇవీచూడండి:పత్తికి 'తెలంగాణ బ్రాండ్‌'!.. మార్కెటింగ్ శాఖ కసరత్తు

ABOUT THE AUTHOR

...view details