AP CM Jagan comments on visakhapatnam Capital : విశాఖ రాజధానిపై ముఖ్యమంత్రి జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర రాజధాని త్వరలోనే విశాఖకు తరలివెళ్తుందని పునరుద్ఘాటించారు. దిల్లీలో జరుగుతున్న గ్లోబల్ ఇన్వెస్టర్ల సదస్సులో పాల్గొన్న జగన్.. అదే వేదిక నుంచి ఈ ప్రకటన చేశారు. తాను కూడా విశాఖకు మకాం మారుస్తానన్నారు. మార్చి 3, 4 తేదీల్లో విశాఖలో ఇన్వెస్టర్ల సదస్సు జరగనుందని వెల్లడించిన జగన్.. అక్కడికి కూడా రావాలని సదస్సులో పాల్గొన్న వివిధ సంస్థల ప్రతినిధులను కోరారు. అందరినీ మరోసారి విశాఖలో కలవాలని ఆకాంక్షించారు.
ఏపీకి రాజధాని విశాఖనే.. నేను అక్కడికే షిఫ్ట్ అవుతున్నా : సీఎం జగన్ - global investors meeting
AP CM Jagan comments on visakhapatnam Capital : ఏపీ సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు. విశాఖపట్నం ఆ రాష్ట్ర రాజధాని కాబోతోందని.. త్వరలో తాను కూడా అక్కడికి షిఫ్ట్ అవుతున్నట్లు చెప్పారు. దిల్లీలోని లీలా ప్యాలెస్ హోటల్‌లో నిర్వహించిన ఏపీ గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ రౌండ్ టేబుల్ సమావేశంలో సీఎం మాట్లాడారు.
AP CM JAGAN
‘‘మార్చి 3, 4 తేదీల్లో విశాఖపట్నంలో ఇన్వెస్టర్ల సదస్సు జరగనుంది. మిమ్మల్ని విశాఖకు ఆహ్వానిస్తున్నా. విశాఖపట్నం రాజధాని కాబోతోంది. కొన్ని నెలల్లో నేను కూడా అక్కడికి షిఫ్ట్ అవుతున్నా. మిమ్మల్ని మరోసారి విశాఖలో కలవాలని ఆకాంక్షిస్తున్నా’’ అని జగన్ వ్యాఖ్యానించారు." -జగన్, ఏపీ సీఎం
ఇవీ చదవండి: