తెలంగాణ

telangana

By

Published : Jan 4, 2021, 1:47 PM IST

ETV Bharat / state

రాజకీయ గెరిల్లా యుద్ధాన్ని పోలీసులే అడ్డుకోవాలి: జగన్​

రాజకీయపరంగా జరుగుతున్న గెరిల్లా యుద్ధాన్ని పోలీసులు అడ్డుకోవాలని ఏపీ సీఎం జగన్​ అన్నారు. రాజకీయాల కోసం దేవుణ్ని కూడా వదలడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్​ రాష్ట్ర పోలీస్‌ డ్యూటీ మీట్‌లో వర్చువల్​ విధానంలో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్​ ప్రసంగించారు. ప్రైవేటు ఆలయాలు, ప్రతిపక్ష నాయకుల ఆలయాల్లో ఘటనలు జరుగుతున్నాయని అన్నారు. దేవుడంటే భయం భక్తి లేని పరిస్థితి నేడు కనిపిస్తోందన్నారు.

jagan
రాజకీయ గెరిల్లా యుద్ధాన్ని పోలీసులే అడ్డుకోవాలి: జగన్​

రాజకీయ గెరిల్లా యుద్ధాన్ని ఎదుర్కొనేలా పోలీసులు సిద్ధం కావాలని ఆంధ్రప్రదేశ్​ సీఎం జగన్​ అన్నారు. ఆ రాష్ట్రంలో దేవుని విగ్రహాలతో చెలగాటమాడుతోన్న పరిస్థితి కనిపిస్తోందని పేర్కొన్నారు. ప్రైవేటు ఆలయాలు, ప్రతిపక్ష నాయకుల ఆలయాల్లో ఘటనలు జరుగుతున్నాయని జగన్​ ఆరోపించారు. పోలీస్‌ డ్యూటీ మీట్‌లో వర్చువల్​ విధానంలో ఆ రాష్ట్ర సీఎం జగన్​ ప్రసంగించారు. 20 వేల ఆలయాల్లో ఇప్పటికే సీసీ కెమెరాలు ఏర్పాటు చేసినా.. ఆలయాల్లో దాడులు కొనసాగుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజకీయపరంగా జరుగుతున్న గెరిల్లా యుద్ధాన్ని పోలీసులు అడ్డుకోవాలని సూచించారు.

సమాజంలో వైట్ కాలర్ నేరాలు పెరిగిపోయాయి. దేవుడంటే భక్తి, భయం లేని పరిస్థితి నేడు నెలకొంది. రాజకీయాల కోసం దేవుణ్ని కూడా వదలడం లేదు. యుగం మారింది.. కలియుగంలో క్లైమాక్స్ వచ్చే పరిస్థితులు కనిపిస్తున్నాయన్నారు. దేవుని ద్వారా రాజకీయాలు పొందే దారుణమైన క్లైమాక్స్‌లో మనం ఉన్నాం.- ఏపీ సీఎం జగన్​

దేవుని విగ్రహాలతో చెలగాటమాడుతోన్న పరిస్థితి కనిపిస్తోందని జగన్​ ఆక్షేపించారు. దేవుడంటే భయం భక్తి లేని పరిస్థితి నేడు కనిపిస్తోందని అన్నారు. ఇలాంటి క్షక్షపూరిత చర్యలను ఎదుర్కోవడానికి పోలీసులు సమర్థవంతంగా పని చేయాలని సూచించారు. ఉద్రేకాలు రెచ్చగొట్టి హింసకు పాల్పడితే ఎవరికి లాభం ఉంటుందని.. ఎవరిని లక్ష్యంగా చేసుకుని దుర్మార్గాలు చేస్తున్నారని నిలదీశారు. ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయో ప్రజలు ఆలోచించాలన్నారు. ఆలయాలను కూడా వదిలిపెట్టకుండా దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

తప్పు ఎవరు చేసినా తప్పే... అన్యాయం ఎవరూ చేసినా శిక్షించాల్సిందే. పార్టీలు, కులాలు, మతాలు చూడాల్సిన అవసరం లేదు. 18 నెలల కాలంలో ఎలాంటి భేదాభిప్రాయాలు చూపలేదు. అర్హులైన ప్రతిఒక్కరికీ సంక్షేమ పథకాలు అందిస్తున్నాం. మంచి పాలన చూసి ఓర్వలేక కుట్రలు పన్నుతున్నారు. నేరాలు చేసే వారి మనస్తత్వాలు పూర్తిగా మారిపోతున్నాయి. - ఏపీ సీఎం జగన్​

సంక్షేమ పథకాలను ప్రారంభిస్తున్న రోజుల్లోనే విగ్రహాల ధ్వంసాలు జరుగుతున్నాయని జగన్​ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ పథకాలకు ప్రచారం జరగకూడదనే విగ్రహ ధ్వంసాల కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. తమ ప్రభుత్వం ఎప్పుడు మంచి పనులు చేస్తుంటే అప్పుడే ఆంధ్రప్రదేశ్​లో ఘటనలు జరుగుతున్నాయని అన్నారు.

ABOUT THE AUTHOR

...view details