తెలంగాణ

telangana

ETV Bharat / state

విశాఖ మృతుల కుటుంబాలకు రూ.కోటి పరిహారం: సీఎం జగన్​ - vishaka updated news

ఏపీలోని విశాఖలో గ్యాస్ ​లీకేజ్​ ఘటన అత్యంత బాధాకరమన్నారు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్. మృతుల కుటుంబాలకు కోటి పరిహారం వచ్చేలా చూస్తామని హామీ ఇచ్చారు. ప్రమాదంపై నివేదిక ఇచ్చేందుకు కమిటీ వేస్తున్నట్లు తెలిపారు. ఆ నివేదిక ఆధారంగా తదుపరి చర్యలుంటాయని స్పష్టం చేశారు.

ap-cm-jagan-adressed-visakha-incident-suffering-families
విశాఖ మృతుల కుటుంబాలకు రూ.కోటి పరిహారం: ఏపీ సీఎం

By

Published : May 7, 2020, 3:30 PM IST

Updated : May 7, 2020, 10:49 PM IST

ఆంధ్రప్రదేశ్​లోని విశాఖలో గ్యాస్ లీకేజీ ఘటనపై వాస్తవాలు తేల్చేందుకు కమిటీ వేస్తున్నామని సీఎం జగన్​ తెలిపారు. ఎల్‌జీ పాలిమర్స్‌లో సంస్థలో జరిగిన ఘటనపై విచారం వ్యక్తం చేశారు. ప్రమాదంపై కమిటీ లోతుగా అధ్యయనం చేసి నివేదిక ఇస్తుందని చెప్పారు. నివేదిక ఆధారంగా తదుపరి చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఘటన జరిగిన వెంటనే కలెక్టర్​, డీసీపీ అక్కడికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టనట్లు వివరించారు. 340 మందికిపైగా స్థానికులను ఆస్పత్రులకు తరలించినట్లు వెల్లడించారు. అస్వస్థత నుంచి చాలా మంది కోలుకున్నట్లు చెప్పారు.

కోటి పరిహారం వచ్చేలా చూస్తాం

విశాఖ మృతుల కుటుంబ సభ్యులకు అన్ని రకాలుగా అండగా ఉంటామని సీఎం భరోసా ఇచ్చారు. ఆయా కుటుంబాలకు కంపెనీ నుంచి రూ.కోటి పరిహారం వచ్చేలా చూస్తామని అన్నారు. రెండు, మూడ్రోజులపాటు ఆస్పత్రుల్లో ఉన్నవారికి రూ.లక్ష పరిహారం ఇస్తామని తెలిపారు. వెంటిలేటర్ సాయంతో చికిత్స తీసుకునే వారికి రూ.10 లక్షలు.. స్వల్ప అస్వస్థతకు గురైన వారికి రూ.25 వేలు పరిహారం ఇస్తామని వెల్లడించారు.

విశాఖ మృతుల కుటుంబాలకు రూ.కోటి పరిహారం: సీఎం

ఇదీ చూడండి: విశాఖ గ్యాస్​లీక్​ ఘటనపై కిషన్​రెడ్డి ఆరా

Last Updated : May 7, 2020, 10:49 PM IST

ABOUT THE AUTHOR

...view details