AP Cabinet meeting today: : సచివాలయంలో సీఎం జగన్ అధ్యక్షతన ఆంధ్రప్రదేశ్ కేబినెట్ సమావేశం ప్రారంభమైంది. సచివాలయం మొదటి బ్లాక్‌లో ఉదయం 11 గంటలకు మంత్రివర్గం సమావేశం కొనసాగుతోంది. మోడల్ స్కూళ్లు, విద్యా సొసైటీల ఉద్యోగులకు విరమణ వయసు 62 ఏళ్లకు పెంపు ప్రతిపాదనకు కేబినెట్ ఆమోదం తెలియజేసే అవకాశం ఉంది. అలాగే జిందాల్ స్టీల్‌కు రామాయపట్నం పోర్టులో క్యాఫ్టివ్ బెర్త్ కేటాయింపు ప్రతిపాదన పైనా కేబినెట్ ఆమోదముద్ర వేయనున్నట్టు తెలుస్తోంది.
సీఎం జగన్ అధ్యక్షతన ఏపీ మంత్రిమండలి భేటీ.. వాటికి ఆమోదం తెలిపే అవకాశం..! - సీఎం జగన్ అధ్యక్షతన రాష్ట్ర క్యాబినెట్ సమావేశం
AP Cabinet meeting today: సచివాలయంలో సీఎం జగన్ అధ్యక్షతన ఏపీ కేబినెట్ సమావేశం ప్రారంభమైంది. ఈ సమావేశంలో మోడల్ స్కూళ్లు, విద్యా సొసైటీల ఉద్యోగులకు పదవి విరమణ వయసు 62 ఏళ్లకు పెంపు ప్రతిపాదనకు కేబినెట్ ఆమోదం తెలియజేసే అవకాశం ఉంది.
Cabinet meeting
ఇక సీఎం జగన్ అధ్యక్షతన జరిగిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక మండలిలో (ఎస్ఐపీబీ) తీసుకున్న నిర్ణయాలకు ఆమోదం తెలియజేసే అవకాశం ఉంది. వివిధ ప్రభుత్వ శాఖలు కేబినెట్లో ప్రతిపాదన చేసే అంశాలను పీపీటీ ద్వారా సమర్పించాలని సీఎస్ కార్యాలయం సూచించింది.
ఇవీ చదవండి:
Last Updated : Feb 8, 2023, 1:17 PM IST