తెలంగాణ

telangana

ETV Bharat / state

నివర్ ఎఫెక్ట్: ఏపీ-అమూల్ ప్రాజెక్టు ప్రారంభం వాయిదా - ఏపీ అమూల్ వార్తలు

నివర్ తుపాను కారణంగా ఏపీ సీఎం జగన్ రేపు ప్రారంభించాల్సిన ఏపీ - అమూల్ ప్రాజెక్టు వాయిదా పడింది. ఈ కార్యక్రమాన్ని డిసెంబరు 2కు వాయిదా వేస్తున్నట్టు ఆంధ్రప్రదేశ్​ ప్రభుత్వం ప్రకటించింది.

AMUL project Postponed
నివర్ ఎఫెక్ట్: ఏపీ-అమూల్ ప్రాజెక్టు ప్రారంభం వాయిదా

By

Published : Nov 25, 2020, 8:04 PM IST

Updated : Nov 25, 2020, 8:32 PM IST

రేపు ప్రారంభించాల్సిన ఏపీ-అమూల్ (ఆనంద్‌ మిల్క్‌ యూనియన్‌ లిమిటెడ్‌) ప్రాజెక్టు నివర్ తుపాను కారణంగా వాయిదా పడింది. డిసెంబరు 2కు ఈ కార్యక్రమాన్ని వాయిదా వేస్తునట్టు ఏపీ ప్రభుత్వం ప్రకటించింది.

వైఎస్ఆర్ చేయూతలో భాగంగా ఆంధ్రప్రదేశ్​ ప్రభుత్వం - అమూల్ సంస్థతో కలిసి జగనన్న అమూల్ పాలవెల్లువ కార్యక్రమాన్ని చేపట్టింది. ఆ రాష్ట్ర వ్యాప్తంగా 3 వేల 34 కోట్ల రూపాయల వ్యయంతో 9,889 రైతు భరోసా కేంద్రాల వద్ద బల్క్ మిల్క్ కూలింగ్ యూనిట్లను, సేకరణ కేంద్రాలను దశలవారీగా ఏర్పాటు చేయాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. మొదటి దశలో పైలెట్ ప్రాజెక్టు క్రింద ప్రకాశం, చిత్తూరు, వైఎస్సార్ జిల్లాల్లోని 400 గ్రామాలలో ప్రారంభించాల్సి ఉంది. అయితే నివర్ తుపాను వల్ల ఈ ప్రారంభోత్సవాన్ని వాయిదా వేస్తున్నట్టు ప్రకటించింది.

Last Updated : Nov 25, 2020, 8:32 PM IST

ABOUT THE AUTHOR

...view details