విశ్రాంత ఐపీఎస్ అధికారి అనురాగ్ శర్మ పదవీ కాలాన్ని ప్రభుత్వం పొడిగించింది. పోలీస్, శాంతిభద్రతలు, నేర నియంత్రణలో ప్రభుత్వ సలహాదారుగా కొనసాగుతున్న అనురాగ్ శర్మ పదవీ కాలాన్ని మరో మూడేళ్లు పొడిగించారు. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. 1982 ఐపీఎస్ బ్యాచ్‌కు చెందిన అనురాగ్ శర్మ తెలంగాణ తొలి డీజీపీగా పనిచేశారు.
అనురాగ్ శర్మ పదవీ కాలం మరో మూడేళ్లు పొడిగింపు - anurag sharma tenure extension
అనురాగ్ శర్మ పదవీకాలాన్ని రాష్ట్ర ప్రభుత్వం పొడిగించింది. తాజా ఉత్తర్వులతో మరో మూడేళ్లు ఆయన పదవిలో కొనసాగుతారు.
anurag sharma
2017 నవంబర్‌లో పదవీ విరమణ పొందిన వెంటనే సలహాదారుగా ప్రభుత్వం నియమించింది. మూడేళ్ల పదవీ కాలం ఈ నెలతో ముగియనుండటం వల్ల మరో మూడేళ్ల పాటు అనురాగ్ శర్మ పదవీకాలాన్ని ప్రభుత్వం పొడిగించింది. ఈ నెల 12వ తేదీ నుంచి మరో మూడేళ్ల పాటు పొడిగింపు కొనసాగనుంది.
ఇవీ చూడండి: రాష్ట్రంలో అన్ని కోర్టులు తెరవాలని హైకోర్టు నిర్ణయం
Last Updated : Nov 8, 2020, 11:44 PM IST