తెలంగాణ

telangana

ETV Bharat / state

Revanth Reddy: రేపు రేవంత్​ రెడ్డి బాధ్యతల స్వీకరణ.. ముమ్మరంగా ఏర్పాట్లు - రేవంత్​ రెడ్డి వార్తలు

నూతన పీసీసీ అధ్యక్షుడిగా ఎంపీ రేవంత్​ రెడ్డి(Revanth Reddy) హైదరాబాద్​లోని గాంధీభవన్​లో బాధ్యతలు చేపట్టనున్నారు. ఇందుకు అనుగుణంగా ఏర్పాట్లు సాగుతున్నాయి. ఈ కార్యక్రమానికి జిల్లాల నుంచి కాంగ్రెస్​ కార్యకర్తలు భారీగా తరలి వచ్చే అవకాశం ఉంది.

revanth reddy, Gandhi bhavan
రేవంత్​ రెడ్డి, గాంధీ భవన్​

By

Published : Jul 6, 2021, 5:22 PM IST

Updated : Jul 6, 2021, 8:29 PM IST

పీసీసీ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి(Revanth Reddy) పదవీ బాధ్యతలు చేపట్టేందుకు ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. హైదరాబాద్ ​నాంపల్లిలోని గాంధీ భవన్(Gandhi bhavan)​ లో రేవంత్​ రేపు బాధ్యతలు స్వీకరించనున్నారు. ఇందుకు అనుగుణంగా ఏర్పాట్లు చేస్తున్నారు. వాస్తు నిపుణుల సూచనల మేరకు గాంధీ భవన్​లో పలు మార్పులు చేశారు. ఇప్పటికే భవనానికి రంగులు వేశారు. ఫ్లోరింగ్​ వేయటంతో చెట్లను ట్రిమ్ చేశారు. ఈ మార్పులతో గాంధీ భవన్​ కొత్తగా కనిపస్తోంది. మరోవైపు తన బాధ్యతల స్వీకారానికి రావాలని పార్టీ నేతలు, కార్యకర్తలకు రేవంత్​ రెడ్డి ఆహ్వానం పంపారు. కర్ణాటక వెళ్లి రాజ్యసభ ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గే, కర్ణాటక మాజీ సీఎం సిద్దరామయ్య, అక్కడి పీసీసీ అధ్యక్షుడు డి.కే శివకుమార్​ ఆహ్వానించారు.

ఉదయం నుంచే కార్యక్రమాలు

బుధవారం ఉదయం 10 గంటలకు జూబ్లీహిల్స్​లోని పెద్దమ్మ తల్లి గుడిలో రేవంత్​ రెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. 11 గంటలకు నాంపల్లి దర్గా వద్ద ప్రత్యేక ప్రార్థనలు చేసి గాంధీ భవన్​కు ర్యాలీగా బయల్దేరుతారు. మధ్యాహ్నం ఒంటి గంట 30 నిమిషాలకు రేవంత్​ రెడ్డి బాధ్యతలు స్వీకరిస్తారు. ఆయనతో పాటు వర్కింగ్​ ప్రెసిడెంట్లు, పలు విభాగాల ఛైర్మన్లు, సీనియర్​ ఉపాధ్యక్షులు పదవీ బాధ్యతలు స్వీకరిస్తారు. బాధ్యతల స్వీకరణ అనంతరం రేవంత్​ రెడ్డి బహిరంగ సభలో పాల్గొంటారు.

పార్టీ పెద్దలతో భేటీ

బాధ్యతల స్వీకరించేలోపు రేవంత్​ రెడ్డి(Revanth Reddy) పార్టీ సీనియర్లను కలిసే పనిలో పడ్డారు. ఇప్పటికే ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వీహెచ్​ను కలిసి ఆయన యోగాక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. దామోదర రాజనరసింహ, రేణుకా చౌదరి, పొన్నం ప్రభాకర్​, ​షబ్బీర్​ అలీ, ఏఐసీసీ కార్యదర్శి వంశీచంద్​ రెడ్డి, సంపత్​ కుమార్​, నాగం జనార్దన్​ రెడ్డి, కొండా సురేఖ, ఏఐసీసీ సభ్యులు కుసుమ కుమార్​ను కలిశారు. ఇవాళ సీఎల్పీ నేత భట్టి విక్రమార్కతో భేటీ అయ్యారు. రేపటి పదవీ బాధ్యతల స్వీకరణ కార్యక్రమానికి రావాలని రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. అనంతరం మర్రి శశిధర్​ రెడ్డి, మంథని ఎమ్మెల్యే శ్రీధర్​ బాబును కూడా కలిశారు.

భారీగా ఏర్పాట్లు

మరోవైపు నూతన పీసీసీ అధ్యక్షుడికి ఘన స్వాగతం పలికేందుకు భారీ ఏర్పాట్లు జరుగుతున్నాయి. గాంధీ భవన్ ప్రాంగణంలో, వెలుపల రేవంత్​ రెడ్డికి స్వాగతం పలుకుతూ పెద్ద ఎత్తున ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. రేవంత్​ రెడ్డి బాధ్యతల స్వీకరణ కార్యక్రమానికి జిల్లాల నుంచి కాంగ్రెస్​ కార్యకర్తలు భారీగా తరలి వచ్చే అవకాశం ఉంది.

ఇదీ చదవండి:KTR: రుణాలు ఇచ్చేందుకు బ్యాంకులు ముందుకు రావాలి

Last Updated : Jul 6, 2021, 8:29 PM IST

ABOUT THE AUTHOR

...view details