గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని అన్ని చెరువుల్లో డ్రోన్లను ఉపయోగించి యాంటీ లార్వా పిచికారీ చేస్తున్నట్లు జీహెచ్ఎంసీ చీఫ్ ఎంటమాలజిస్ట్ రాంబాబు తెలిపారు. ప్రతి చెరువులో డ్రోన్ల ద్వారా వారానికోసారి ఈ ఆపరేషన్స్ నిర్వహిస్తామని వెల్లడించారు. ప్రస్తుతం నగరంలో 5 డ్రోన్ల ద్వారా ఖైరతాబాద్, సికింద్రాబాద్, శేరిలింగంపల్లి, కూకట్‌పల్లి, ఎల్బీనగర్ జోన్లలో చేస్తున్నట్లు వివరించారు.
దోమలపై బల్దియా డ్రోన్ యుద్ధం
హైదరాబాద్లో కరోనా వైరస్, సీజనల్ వ్యాధులు ప్రబలకుండా జీహెచ్ఎంసీ అధికారులు చర్యలు చేపట్టారు. దీనిలో భాగంగా గ్రేటర్ పరిధిలోని అన్ని చెరువుల్లో డ్రోన్లను ఉపయోగించి యాంటీ లార్వా పిచికారీ చేయనున్నట్లు వెల్లడించారు. అలాగే గుర్రపు డెక్కలను కూడా తొలగించడానికి చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు.
దోమలపై బల్దియా డ్రోన్ యుద్ధం
ఈ జోన్లలో మొత్తం 54 మందిని నియమించారని పేర్కొన్నారు. మూసీ నదిలో కూడా ఈ ప్రక్రియను కొనసాగించనున్నట్లు తెలిపారు. మరో 11 డ్రోన్ల ద్వారా మిగిలిన జోన్లలో కూడా దోమల నివారణకు చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు. టెండర్ల ద్వారా గుర్రపుడెక్క తొలగించడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయని పేర్కొన్నారు.