తెలంగాణ

telangana

ETV Bharat / state

అవినీతి నిరోధించడానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలి - karim nagar latest news

లంచం ఇవ్వడం తీసుకోవడం రెండూ నేరమేనని అవినీతి నిరోధక శాఖ ఆధ్వర్యంలో కరీంనగర్​లోని  విద్యార్థులు, స్వచ్ఛంద సంస్థలతో కలిసి ర్యాలీని నిర్వహించారు. అవినీతిని నిరోధించడంపై ఈ నెల 9వ తేదీ వరకు పలు అవగాహన కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుందని ఏసీబీ డీఎస్పీ భద్రయ్య తెలిపారు.

anti-corruption-awareness-in-karimnagar
అవినీతి నిరోధించడానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలి

By

Published : Dec 4, 2019, 5:06 PM IST

లంచం ఇవ్వడం తీసుకోవడం రెండు నేరమేనని అవగాహన కల్పిస్తూ కరీంనగర్‌లో అవినీతి నిరోధక శాఖ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. విద్యార్థులతో పాటు వివిధ శాఖలకు చెందిన అధికారులు ఈ ర్యాలీలో పాల్గొన్నారు. సర్కస్ గ్రౌండ్ వద్ద ర్యాలీని సంయుక్త పాలనాధికారి శ్యాంప్రసాద్‌లాల్‌ జెండా ఊపి ప్రారంభించారు. లంచగొండి తనం ప్రస్తుతం క్యాన్సర్‌ మహమ్మారిలా వ్యాప్తి చెందుతోందని.. దీనిని అరికట్టేందుకు ప్రతి ఒక్క పౌరుడు నడుం బిగించాల్సిన అవసరం ఉందని అధికారులు పేర్కొన్నారు.

ఏసీబీ డీఎస్పీ భద్రయ్యతో పాటు పలు స్వచ్చంధ సంస్థలు ఈ ర్యాలీలో పాల్గొన్నాయి. ఈనెల 9 తేదీ వరకు ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ర్యాలీలు, సదస్సులు, క్విజ్ పోటీలు నిర్వహించనున్నట్లు డీఎస్పీ భద్రయ్య తెలిపారు. అవినీతికి సంబంధించిన ఏ సమస్య అయినా 1064 ఫోన్ నంబర్‌కు తెలియజేయాలని సూచించారు. ర్యాలీ అనంతరం కలెక్టరేట్ ప్రాంగణంలో అవినీతిని నిర్మూలిద్దామని ప్రతిజ్ఞ చేయించారు.

అవినీతి నిరోధించడానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలి

ఇదీ చూడండి: ఆర్టీసీ బస్సులో ప్రయాణించిన ఎమ్మెల్యే

ABOUT THE AUTHOR

...view details