Anti Congress Posters Hyderabad : హైదరాబాద్‌లో సీడబ్ల్యూసీ సమావేశాలు జరుగుతున్న సమయంలోనే.. కాంగ్రెస్ తీరుపై నగరంలో (Anti Congress Posters) గోడ పత్రికలు వెలిశాయి. హస్తం పార్టీ పాలిత రాష్ట్రాల్లో ఉన్న పథకాలు.. తెలంగాణలో అమలవుతున్న పథకాలను పోల్చుతూ వాల్ పోస్టర్లను అతికించారు. కరప్ట్ కాంగ్రెస్ మోడల్.. కరెక్ట్ బీఆర్‌ఎస్ మోడల్ అంటూ అందులో పేర్కొన్నారు. దళితబంధు, రైతు బంధు, రైతు బీమా, వృద్ధులు, వికలాంగుల పింఛన్ల గురించి వివరిస్తూ పోస్టర్లను రూపొందించారు.
Posters on BRS and Congress Difference :తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఇస్తున్న హామీలకు.. ఆ పార్టీ అధికారంలో ఉన్న ఇతర రాష్ట్రాల్లో అమలు చేస్తున్న పథకాలకు పొంతన లేదంటూ ( BRS and Congress Difference) ఆ పోస్టర్లలో పేర్కొన్నారు. దళితులకు ఆర్థిక సాయం గురించి పేర్కొంటూ.. హస్తం పాలిత రాష్ట్రాలైన ఛత్తీస్గడ్, హిమాచల్‌ప్రదేశ్, కర్ణాటక, రాజస్థాన్‌లో లేదని.. ఇక్కడ తెలంగాణలో రూ.10 లక్షలు ఇస్తున్నామని గోడ పత్రికల్లో ముద్రించారు. వికలాంగులకు కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలైన ఛత్తీస్‌గఢ్‌లో రూ.500, హిమాచల్‌ప్రదేశ్‌లో రూ.1300, కర్ణాటకలో రూ.1100, రాజస్థాన్‌లో రూ.1250 చొప్పున పింఛన్ ఇస్తుంటే.. తెలంగాణలో మాత్రం రూ.4116 ఇస్తున్నట్లు అందులో తెలిపారు.
Poster War in Hyderabad Amid CWC Meeting :అలాగే వృద్ధుల పింఛన్ కాంగ్రెస్పాలిత రాష్ట్రాలైన ఛత్తీస్‌గడ్‌లో రూ.500, హిమాచల్‌ప్రదేశ్‌లో రూ.750 నుంచి రూ.1250, కర్ణాటకలో రూ.1000, రాజస్థాన్‌లో రూ.1000 నుంచి రూ.1250 వరకు ఇస్తున్నారని.. తెలంగాణలో మాత్రం రూ.2016 అందిస్తున్నామంటూ పోస్టర్లలో తెలిపారు. రైతులకు బీమా పథకం గురించి తెలుపుతూ.. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో సున్నా అయితే.. రాష్ట్రంలో రూ.5 లక్షలు ఇస్తున్నామని వివరించారు.
అన్నదాతలకు పెట్టుబడి సాయంగా తెలంగాణలో ఎకరానికి ఏడాదికి రూ.10,000 ఇస్తున్నట్లు పేర్కొన్నారు. రైతులకు ఉచిత విద్యుత్ గురించి తెలుపుతూ కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలైన ఛత్తీస్గడ్, హిమాచల్‌ప్రదేశ్, కర్ణాటక, రాజస్థాన్‌లో లేదని.. తెలంగాణలో 24 గంటల పాటు ఉచిత విద్యుత్ ఇస్తున్నామని గోడ పత్రికల్లో వివరించారు. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.