తెలంగాణ

telangana

ETV Bharat / state

'అంతర్వేది ఆలయ రథం కాలిపోవడం దురదృష్టకరం' - తూర్పుగోదావరి జిల్లా వార్తలు

ఏపీ అంతర్వేది లక్ష్మీనరసింహస్వామి ఆలయ రథం దగ్ధం ఘటన దురదృష్టకరమని ఎంపీ రఘురామకృష్ణరాజు అన్నారు. రథం కాలిన విధానం చూస్తుంటే కుట్ర ప్రకారం జరిగినట్లు అనుమానంగా ఉందన్నారు.

అంతర్వేది ఆలయ రథం కాలిపోవడం దురదృష్టకరం
అంతర్వేది ఆలయ రథం కాలిపోవడం దురదృష్టకరం

By

Published : Sep 6, 2020, 4:36 PM IST

ఏపీ అంతర్వేది రథం కాలిపోయిన విధానం చూస్తుంటే.... కుట్ర ప్రకారమే జరిగినట్లు అనుమానంగా ఉందని.... వైకాపా ఎంపీ రఘురామకృష్ణరాజు వ్యాఖ్యానించారు. ఈ ఘటనపై ముఖ్యమంత్రి స్వయంగా స్పందించాలని ఎంపీ కోరారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా.... చర్యలు తీసుకోవాలని సూచించారు.

ABOUT THE AUTHOR

...view details