తెలంగాణ

telangana

ETV Bharat / state

అక్కడ..చైనీస్ వంటకాలతో కూడిన మొదటి రెస్టారెంట్ ఏఎన్​ఆరే - ఏఎన్ఆర్ పేరుతో రెస్టారెంట్

సికింద్రాబాద్ ఆర్టీవో ఆఫీస్ ముందు ఏఎన్ఆర్ పేరుతో రెస్టారెంట్ ప్రారంభమైంది. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి భోజనశాలను ప్రారంభించారు.

సికింద్రాబాద్​ ఆర్టీవో ఆఫీస్ ముందు ప్రారంభమైన రెస్టారెంట్

By

Published : Aug 27, 2019, 5:00 AM IST

సికింద్రాబాద్​లో కొత్త ఆలోచనలతో ముగ్గురు చిన్ననాటి స్నేహితులు కలిసి ఓ రెస్టారెంట్​ను ప్రారంభించారు. తమ పేరులోని మొదటి అక్షరాన్ని కలిపి రెస్టారెంట్ పేరుగా మార్చుకున్నారు. సరికొత్త హంగులతో,నోరూరించే శాకాహార, మాంసాహార రుచులతో తిరుమలగిరి ఆర్టీవో ఆఫీస్ ఎదుట ఏఎన్ఆర్ పేరుతో రెస్టారెంట్ ప్రారంభమైంది. కార్యక్రమానికి హాజరైన రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి భోజనశాలను ప్రారంభించారు. రెస్టారెంట్ అద్భుతంగా ఉందని.. అందరికీ అందుబాటులో ఉన్న ఈ రెస్టారెంట్​లో ప్రతి ఒక్కరూ రుచి చూడాలని మంత్రి అన్నారు. ఎన్నో రకరకాల రెస్టారెంట్లు, హోటళ్లు వచ్చినప్పటికీ సికింద్రాబాద్ తిరుమలగిరిలో నాన్ వెజ్, వెజ్ ఐటమ్స్​తో కూడిన చైనీస్ వంటకాలను మేళవించిన మొదటి రెస్టారెంట్ ఏఎన్​ఆరే అని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ధరలు అందరికీ అందుబాటులోనే నిర్ణయించినట్లు నిర్వహకులు తెలిపారు.

సికింద్రాబాద్​ ఆర్టీవో ఆఫీస్ ముందు ప్రారంభమైన రెస్టారెంట్

ABOUT THE AUTHOR

...view details