దిశ హత్యాచార ఘటనపై అనుచిత వ్యాఖ్యలు చేసిన మరో యువకుడిని సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడు ఆంధ్ర ప్రదేశ్ గుంటూరు జిల్లా అమరావతి కొండయ్య కాలనీకి చెందిన సాయినాథ్ అలియాస్ నానిగా గుర్తించారు. ఫేస్బుక్లో గ్రూపుగా ఏర్పడి దిశపై అసభ్యకర ప్రచారం, కామెంట్లు చేస్తున్న వారిలో ఇదివరకే ఇద్దరిని అరెస్ట్ చేశారు. అందులో భాగంగానే సాయినాథ్ని కూడా అరెస్ట్ చేసినట్లు సైబర్ క్రైమ్ పోలీసులు తెలిపారు. అనంతరం నిందితుడు నానిని సైబర్ క్రైమ్ పోలీసులు నాంపల్లి కోర్టులో హాజరుపర్చారు.
దిశపై అసభ్య ప్రచారం చేస్తున్న మరో యువకుడి అరెస్ట్ - దిశపై అసభ్య ప్రచారం చేస్తున్న మరో యువకుడి అరెస్ట్
దిశ పేరుతో అసభ్య ప్రచారం, కామెంట్లు చేస్తున్న ఆకతాయిలను సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేస్తున్నారు. అందులో భాగంగానే ఈ రోజు మరో వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు.
దిశపై అసభ్య ప్రచారం చేస్తున్న మరో యువకుడి అరెస్ట్
దిశ పేరుతో సామాజిక మాధ్యమాల్లో అసభ్య ప్రచారాలు చేస్తున్న మరికొంత మందిని కూడా త్వరలోనే అరెస్టు చేస్తామని సీసీఎస్ డీసీపీ అవినాష్ మహంతి తెలిపారు.
ఇవీ చూడండి: '''దిశ' నిందితుల్ని ఉరి తీసే వరకు ఆమరణ దీక్ష''