తెలంగాణ

telangana

ETV Bharat / state

'ఆయుష్మాన్​ భారత్​ కంటే ఆరోగ్య శ్రీనే భేష్..​!' - కంప్ట్రోలర్​ అండ్​ ఆడిటర్​ జనరల్​

ప్రజలకు అమలు చేసే కేంద్ర పథకాల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం స్పష్టతను కలిగి ఉందని ముఖ్యమంత్రి కేసీఆర్​ బడ్జెట్​ ప్రసంగంలో పేర్కొన్నారు. కేంద్రం ప్రవేశపెట్టిన ఆయుష్మాన్​ భారత్​ పథకం కంటే రాష్ట్రంలో అమలవుతున్న ఆరోగ్యశ్రీ పథకం ద్యారా ఎక్కువ ప్రజానికానికి మేలు కలుగుతోందని వెల్లడించారు.

'ఆరోగ్య శ్రీ'నే భేష్​!

By

Published : Sep 9, 2019, 2:05 PM IST

రాష్ట్రం నుంచి గత ఐదేళ్లలో ప్రభుత్వ గణాంకాల ప్రకారం కేంద్రానికి రూ. 2,72,926 కోట్లు అందాయి. కానీ కంప్ట్రోలర్​ అండ్​ ఆడిటర్​ జనరల్​(కాగ్​) నివేదిక ప్రకారం రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమం కింద గడిచిన ఐదేళ్లలో రూ.5,37,373 కోట్లు ఖర్చు పెడితే కేంద్ర పథకాల అమలు కోసం రాష్ట్రానికి రూ. 31,802 వేల కోట్లు మాత్రమే వచ్చాయన్నారు. వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి ఏడాదికి వచ్చే రూ.450 కోట్లలో ఇంకా ఒక ఏడాది నిధులను కేంద్రం విడుదల చేయలేదని ముఖ్యమంత్రి కేసీఆర్​ శాసనసభలో ప్రవేశపెట్టిన బడ్జెట్​ ప్రసంగంలో పేర్కొన్నారు. కేంద్ర పథకాలను అమలు చేసే విషయంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తి అవగాహనతో నిర్ణయాలు తీసుకుంటుందన్నారు. రాష్ట్రంలో అమలవుతున్న ఆరోగ్య శ్రీ పథకం కంటే... కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రవేశపెట్టిన ఆయుష్మాన్​ భారత్​ కన్నా ఎంతో విశిష్టమైందన్నారు. ఆరోగ్యశ్రీ పథకం కింద ఏడాదికి రూ. 1,336 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేస్తే ఆయుష్మాన్​ భారత్​ ద్వారా రూ. 250 కోట్ల విలువైన వైద్య సేవలు మాత్రమే అందుతాయన్నారు. ఆరోగ్యశ్రీ ద్వారా 85 లక్షల 34 వేల కుటుంబాలకు ప్రయోజనం కలిగితే ఆయుష్మాన్​ భారత్​ పథకం వల్ల కేవలం 26 లక్షల కుటుంబాలు మాత్రమే లబ్ధి పొందే అవకాశం ఉందని అందుకే ఆ పథకాన్ని రాష్ట్రంలో అమలుకు వద్దనుకున్నామని సీఎం వెల్లడించారు.

'ఆరోగ్య శ్రీ'నే భేష్​!

ABOUT THE AUTHOR

...view details