తెలంగాణ

telangana

ETV Bharat / state

Himayath Sagar: హిమాయత్‌సాగర్‌కు భారీ వరద.. మరో రెండు గేట్లు ఎత్తివేత - తెలంగాణ వార్తలు

హిమాయత్‌సాగర్(Himayat Sagar) జలాశయానికి వరద నీరు భారీగా వచ్చి చేరుతుంది. మరో రెండు గేట్లను ఎత్తి... మొత్తం 4 గేట్ల ద్వారా నీటిని మూసీలోకి విడుదల చేస్తున్నారు. జలాశయం గరిష్ఠ నీటిమట్టం 1,763.50 అడుగులు ఉండగా ప్రస్తుతం 1,763.05 అడుగులకు చేరింది.

Himayath Sagar, floods to Himayat Sagar
హిమాయత్ సాగర్, హిమాయత్‌ సాగర్ గేట్లు ఎత్తివేత

By

Published : Sep 1, 2021, 4:04 PM IST

Updated : Sep 1, 2021, 5:04 PM IST

హిమాయత్‌సాగర్‌కు భారీ వరద

హిమాయత్‌సాగర్(Himayat Sagar) జలాశయం ఎగువ ప్రాంతంలో భారీ వర్షాలు కురవడం వల్ల వరదనీరు పెద్దఎత్తున వచ్చి చేరుతోంది. ఈ నేపథ్యంలో బుధవారం మరో రెండు గేట్లను ఎత్తి... నీటిని మూసిలోకి వదులుతున్నారు. జలాశయానికి వరద పెరిగి... ఓఆర్‌ఆర్‌ సర్వీస్‌ రోడ్డు మీదుగా ప్రవహిస్తోంది. భారీ వరద నీరు రావడంతో జలమండలి అధికారులు... మంగళవారం రెండు, బుధవారం మరో రెండు గేట్లను ఎత్తివేశారు. మొత్తం నాలుగు గేట్ల ద్వారా 2,100క్యూసెక్కుల నీటిని మూసీలోకి విడుదల చేస్తున్నారు.

హిమాయత్‌ సాగర్ జలాశయం గరిష్ఠ నీటిమట్టం 1,763.50 అడుగులు ఉండగా ప్రస్తుతం 1,763.05 అడుగులకు చేరింది. ఈ జలాశయంలోకి 850క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతోంది. అదే విధంగా ఉస్మాన్‌సాగర్ జలాశయం గరిష్ఠ నీటిమట్టం 1790 అడుగులు కాగా... ప్రస్తుత నీటిమట్టం 1788.40 అడుగులకు చేరింది. ఉస్మాన్‌సాగర్‌లోకి 400క్యూసెక్కుల వరదనీరు వచ్చి చేరుతోంది.

ఇదీ చదవండి:Rajath kumar: 50:50 నిష్పత్తిలో నీటి పంపిణీ జరగాల్సిందే.. రాజీపడే ప్రసక్తే లేదు

Last Updated : Sep 1, 2021, 5:04 PM IST

ABOUT THE AUTHOR

...view details