రాజధాని హైదరాబాద్‌లో పేదలు, మధ్యతరగతి వారికి నాణ్యమైన వైద్యసేవలు అందించే లక్ష్యంతో టిమ్స్ (three more TIMS hospitals IN HYDERABAD ) ఆస్పత్రులు నిర్మించాలని నిర్ణయించిన రాష్ట్ర ప్రభుత్వం... ఆ పనుల ప్రారంభానికి సమాయత్తమవుతోంది (three more TIMS hospitals ). ఇప్పటికే గచ్చిబౌలిలో కొనసాగుతున్న టిమ్స్‌కు అదనంగా గడ్డిఅన్నారం, అల్వాల్, ఎర్రగడ్డలో మరో మూడు టిమ్స్ ఆస్పత్రులను నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. వీలైనంత త్వరగా అధునాతనమైన సౌకర్యాలతో కార్పొరేట్ ఆస్పత్రులను తలదన్నేలా వీటిని నిర్మించాలని భావిస్తున్నారు. ఈ దవాఖానాల్లో అన్ని రకాల సేవలను అందుబాటులోకి తీసుకురానున్నారు.
పూర్తైన స్థలాల గుర్తింపు ప్రక్రియ
మూడు వైద్యశాలల నిర్మాణం కోసం స్థలాల గుర్తింపు ప్రక్రియ పూర్తైంది (three more TIMS hospitals). టిమ్స్ నిర్మాణం కోసం గడ్డిఅన్నారం పండ్ల మార్కెట్‌ను తాత్కాలికంగా బాటసింగారం లాజిస్టిక్ పార్కుకు తరలించారు. దసరా రోజు అక్కడ కార్యకలాపాలు కూడా ప్రారంభమయ్యాయి. అక్కడకు వెళ్లేలా ప్రభుత్వం వ్యాపారులను ఒప్పించింది. మార్కెట్ తరలింపు అంశం హైకోర్టులో ఉంది. వ్యాజ్యాన్ని ఉపసంహరించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ నెల 18న న్యాయస్థానంలో ఇందుకు సంబంధించి స్పష్టత వస్తే ఆ తర్వాత ఆస్పత్రి నిర్మాణానికి కసరత్తు ప్రారంభించాలని ప్రభుత్వం భావిస్తోంది.
త్వరలోనే నిర్మాణ పనులు
అల్వాల్‌లో ఆస్పత్రి నిర్మాణం కోసం 26 ఎకరాల స్థలాన్ని ప్రభుత్వం స్వాధీనం చేసుకొంది. భారతీయ విద్యాభవన్‌కు చెందిన ఆ స్థలాన్ని తీసుకొన్న ప్రభుత్వం... వారికి వేరే చోట స్థలాన్ని కేటాయించింది. ఎర్రగడ్డలోని ఛాతి ఆస్పత్రి స్థలంలో టిమ్స్ (three more TIMS hospitals) నిర్మాణాన్ని చేపట్టనున్నారు. వీలైనంత త్వరగా ఈ వైద్యశాలల నిర్మాణం పనులను ప్రారంభించాలన్న యోచనలో ప్రభుత్వం ఉంది. రహదార్లు, భవనాల శాఖ ద్వారా భవనాల నిర్మాణాన్ని చేపట్టాలని ఇప్పటికే నిర్ణయించారు.