రాష్ట్రంలో మరో ఎమ్మెల్యేకు కరోనా సోకింది. నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే గణేశ్ గుప్తాకు పరీక్షల్లో కొవిడ్ పాజిటివ్‌గా తేలింది. ఇప్పటికే జనగామ శాసనసభ్యుడు ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్‌కు కొవిడ్-19 పాజిటివ్ వచ్చింది. నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్‌తో కలిసి కొన్ని రోజులుగా వివిధ కార్యక్రమాల్లో గణేష్ గుప్తా పాల్గొన్నారు. రెండు రోజులుగా కరోనా లక్షణాలు కనిపించడం సహా బాజిరెడ్డికి కరోనా సోకినట్లు వైద్య పరీక్షల్లో వెల్లడైన నేపథ్యంలో గణేష్ గుప్తా పరీక్షలు చేయించుకున్నారు. ఫలితంగా గుప్తా కొవిడ్ బారిన పడ్డారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే ముగ్గురు ఎమ్మెల్యేలకు కొవిడ్ నిర్థరణ కాగా అంతా అధికార పార్టీకి చెందినవారే.
మరో తెరాస శాసన సభ్యుడికి కరోనా... గణేశ్ గుప్తాకు పాజిటివ్ - ANOTHER TELANGANA MLA TESTED CORONA POSITIVE
రాష్ట్రంలో మరో ఎమ్మెల్యేకు కరోనా పాజిటివ్
15:38 June 15
మరో శాసన సభ్యుడికి కరోనా... ఎమ్మెల్యే గణేశ్ గుప్తాకు పాజిటివ్
Last Updated : Jun 15, 2020, 5:08 PM IST