రాష్ట్రంలో మరో ప్రాంతీయ పార్టీ అవసరం ఎంతైనా ఉందని... మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి అభిప్రాయపడ్డారు. రెండు ప్రాంతీయ పార్టీలు ఉన్న రాష్ట్రాలు అభివృద్ధి చెందుతున్నాయని.. తెలంగాణలో మరో పార్టీ రావాలని చెప్పారు.
కాంగ్రెస్ బలమైన ప్రతిపక్షంగా ఉండలేకపోతోంది: కొండా విశ్వేశ్వర్ రెడ్డి - కొండా విశ్వేశ్వర్‌రెడ్డి తాజా వార్తలు
తెలంగాణలో కాంగ్రెస్ ప్రత్యామ్నాయ పార్టీగా... బలమైన ప్రతిపక్షంగా ఉండలేకపోతోందని మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి అన్నారు. తెరాసను ఎదుర్కొడంలో విఫలం చెందిందని చెప్పారు. చాలా మంది నాయకులు అమ్ముడుపోతున్నారని ఆరోపించారు.
కొండా విశ్వేశ్వర్ రెడ్డి
కాంగ్రెస్ పార్టీ ప్రత్యామ్నాయ పార్టీగా... బలమైన ప్రతిపక్షంగా ఉండలేకపోతోందని.. చాలా మంది నాయకులు అమ్ముడుపోతున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన అనంతరం.. వివిధ పార్టీల నేతలతో మాట్లాడినట్లు తెలిపారు. భాజపాలో చేరాలా.. లేదా కొత్త పార్టీ పెట్టాలా... స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయాలా అనేది త్వరలో నిర్ణయించుకుంటానన్నారు.
ఇదీ చదవండి:చైతన్యపురిలో కారు బీభత్సం.. సీసీలో దృశ్యాలు నిక్షిప్తం