తెలంగాణ

telangana

ETV Bharat / state

రాష్ట్రానికి మరో ప్రతిష్ఠాత్మక అంతర్జాతీయ సంస్థ - కేటీఆర్ తాజా వార్తలు

International Company to Telangana : రాష్ట్రానికి మరో ప్రతిష్ఠాత్మక అంతర్జాతీయ సంస్థ రానుంది. సీ ఫర్‌ ఐఆర్‌ సంస్థ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టనుంది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకుంది. దావోస్‌లో జరుగుతున్న ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సులో ఈ ఒప్పందం కుదిరింది. లైఫ్ సైన్సెస్ హెల్త్ కేర్ రంగంలో ఉన్న అవకాశాలను భారత్‌ అందిపుచ్చుకోవడానికి ఈ కేంద్రం ఏర్పాటు దోహదపడుతుందని మంత్రి కేటీఆర్ ఆశాభావం వ్యక్తం చేశారు.

Telangana
Telangana

By

Published : Jan 16, 2023, 8:43 PM IST

International Company to Telangana : ప్రపంచ ఆర్థిక వేదిక వార్షిక సదస్సు తొలిరోజే తెలంగాణకు కీలక విజయం లభించింది. ఇప్పటికే పలు అంతర్జాతీయ సంస్థలకు కేంద్రంగా మారిన హైదరాబాద్ నగరానికి మరో ప్రతిష్ఠాత్మక అంతర్జాతీయ సంస్థ వచ్చేందుకు మార్గం సుగమమైంది. సీ ఫర్‌ ఐఆర్‌ సంస్థ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టనుంది. స్విట్లర్లాండ్‌ దావోస్‌లో జరుగుతున్న ప్రపంచ ఆర్థిక వేదిక వార్షిక సమావేశంలో ఈ మేరకు ఒప్పందం జరిగింది.

హెల్త్‌ కేర్‌, లైఫ్‌ సైన్సెస్‌ రంగాల్లో సేవలు అందిస్తోన్న ఈ సంస్థ.. ఇప్పటికే అమెరికా, బ్రిటన్‌ దేశాల్లో విస్తరించింది. తాజాగా భారత్‌లో అడుగుపెడుతున్న ఈ సంస్థ తొలిసారిగా హైదరాబాద్‌లో ఏర్పాటు కానుంది. వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్‌ ఎండీ జెరేమీ జర్గన్స్, తెలంగాణ లైఫ్ సెన్సెస్ ఫౌండేషన్ సీఈవో శక్తి నాగప్పన్‌లు ఈ ఒప్పందంపై సంతకాలు చేశారు. కార్యక్రమంలో ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్, ఐటీ శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ జయేశ్​రంజన్ పాల్గొన్నారు.

ఆరోగ్య సంరక్షణ రంగంలో ఉపాధి అవకాశాలు పెరుగుతాయి: లైఫ్ సైన్సెస్ హెల్త్ కేర్ రంగంలో ఉన్న అవకాశాలను భారత్‌ అందిపుచ్చుకోవడానికి ఈ కేంద్రం ఏర్పాటు దోహదపడుతుందని మంత్రి కేటీఆర్ ఆశాభావం వ్యక్తం చేశారు. లైఫ్ సైన్సెస్ రంగంలో తెలంగాణకు ఉన్న అనుకూలతలు, సత్తాకు ఈ కేంద్రం ఏర్పాటే నిదర్శనం అని ఆయన అన్నారు. తెలంగాణతో పాటు ప్రపంచవ్యాప్తంగా లైఫ్ సైన్సెస్ రంగం ఎదుగుదల, ఎకో సిస్టం పెంపొందించడానికి రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ముందడుగుగా ఈ కేంద్రం ఏర్పాటును భావిస్తున్నామని మంత్రి కేటీఆర్ అన్నారు. జీవశాస్త్రాలు, ఆరోగ్య సంరక్షణ అంశాలపై సీ ఫర్‌ ఐఆర్‌ సంస్థ అధ్యయనం చేస్తుందన్నారు. దేశంలో సీ ఫర్‌ ఐఆర్‌ విభాగాన్ని ఏర్పాటు చేయడం ఇదే తొలిసారని.. ప్రస్తుతం అమెరికా, బ్రిటన్ దేశాల్లో ఇలాంటి కేంద్రాలు ఉన్నాయని కేటీఆర్ తెలిపారు. ఈ కేంద్రం ఏర్పాటు కోసం హైదరాబాద్‌ను ఎంచుకున్నందుకు సంతోషంగా ఉందన్న కేటీఆర్.. ఆరోగ్య సంరక్షణ రంగంలో ఉపాధి అవకాశాలు పెరుగుతాయన్నారు.

గ్లోబల్ పవర్ హౌస్​గా ఇండియా: హైదరాబాద్‌లో సీ ఫర్‌ ఐఆర్‌ ఏర్పాటు వల్ల.. ఆరోగ్య సంరక్షణ రంగంలో ఉపాధి అవకాశాలు పెరుగుతాయని ఫోరమ్ అధ్యక్షుడు బ్రెందే అన్నారు. వ్యాక్సిన్లు, ఎన్నో ఔషధాల తయారీలో భారతదేశం, హైదరాబాద్​లకు మంచి ట్రాక్ రికార్డు ఉందని.. నాలుగో పారిశ్రామిక విప్లవ సాంకేతికతను ఉపయోగించుకొని ఆరోగ్య సంరక్షణలో గ్లోబల్ పవర్ హౌస్​గా ఇండియా మారుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రాంతీయ, జాతీయ, ప్రపంచ ఆరోగ్య సంరక్షణ రంగంలో వినూత్న మార్పులు తేవడంతో పాటు రోగులకు ప్రస్తుతం ఉన్న సౌకర్యాలను మెరుగుపరచడంలో ఈ కొత్త కేంద్రం ముఖ్యమైన పాత్ర పోషిస్తుందన్నారు. నాలుగు ఖండాలలో విస్తరించి ఉన్న వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్.. నాలుగో పారిశ్రామిక విప్లవం సీ ఫర్‌ ఐఆర్‌ నెట్‌వర్క్‌లో హైద్రాబాద్ 18వ కేంద్రం అని ఆ సంస్థ వెల్లడించింది.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details