కార్మిక బీమా వైద్య సేవల సంస్థ (ఐఎంఎస్) మందుల కొనుగోలు కుంభకోణంలో అవినీతి నిరోధక శాఖ అధికారులు మరొకరిని అరెస్టు చేశారు. తేజ ఫార్మసీ ఎండీ రాజేశ్వర్‌రెడ్డి సోదరుడు శ్రీనివాస్‌రెడ్డిని అదుపులోకి తీసుకుని అనిశా ప్రత్యేక కోర్టులో హాజరుపరిచారు. దీంతో ఈ కేసులో అరెస్టయిన వారి సంఖ్య 17కు చేరింది. శ్రీనివాస్‌రెడ్డి నివాసంలో సోదాలు జరిపిన విచారణ అధికారులు పెద్దఎత్తున బిల్లులు, నకిలీ ఇండెంట్లు స్వాధీనం చేసుకున్నారు. దేవికారాణి- శ్రీనివాస్‌రెడ్డిల పేరిట డొల్ల కంపెనీలు ఏర్పాటు చేసినట్టు గుర్తించారు. కాగా శ్రీనివాస్‌రెడ్డికి కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. అధికారులు అతన్ని చంచల్‌గూడ జైలుకు తరలించారు.
ఈఎస్ఐ కుంభకోణం కేసులో మరొకరి అరెస్టు
ఈఎస్ఐ కుంభకోణం కేసులో అవినీతి నిరోధక శాఖ అధికారులు మరొకరిని అదుపులోకి తీసుకున్నారు.
ఈఎస్ఐ కుంభకోణం కేసులో మరొకరి అరెస్టు