తెలంగాణ

telangana

ETV Bharat / state

నేటి నుంచి ఎంసెట్ చివరి విడత కౌన్సిలింగ్ - Ts emcet counseling last chance

గతంలో ఎంసెట్ కౌన్సెలింగ్​కు హాజరుకాలేని వారికి మరో అవకాశం కల్పించారు. ఈనెల 8న ధ్రువపత్రాల పరిశీలన ఉంటుందని ప్రవేశాల కమిటీ కన్వీనర్, సాంకేతిక విద్యా శాఖ కమిషనర్ నవీన్ మిత్తల్ తెలిపారు.

ఎంసెట్ కౌన్సెలింగ్​కు హాజరుకాలేని వారికి మరో అవకాశం
ఎంసెట్ కౌన్సెలింగ్​కు హాజరుకాలేని వారికి మరో అవకాశం

By

Published : Nov 7, 2020, 5:17 AM IST

గతంలో ఎంసెట్ కౌన్సెలింగ్​కు హాజరుకాలేని వారికి మరో అవకాశం కల్పించారు. ఈనెల 8న ధ్రువపత్రాల పరిశీలన ఉంటుందని ప్రవేశాల కమిటీ కన్వీనర్, సాంకేతిక విద్యా శాఖ కమిషనర్ నవీన్ మిత్తల్ తెలిపారు. ధ్రువపత్రాల పరిశీలన కోసం ఈనెల 7న ఆన్​లైన్​లో ప్రాసెసింగ్ రుసుం చెల్లించి స్లాట్ బుకింగ్ చేసుకోవాలన్నారు.

ఎంసెట్ రాసేందుకు కనీస అర్హత మార్కులను సవరించిన ప్రభుత్వం ఇంటర్ లో ఉత్తీర్ణులైన వారందరినీ అర్హులుగా పేర్కొంటూ ఇటీవల ప్రభుత్వం జీవో 201 జారీ చేసింది. ఇంటర్మీడియట్ పరీక్షకు హాజరుకాని వారిని, మాల్ ప్రాక్టీస్​కు పాల్పడిన వారిని కూడా ఉత్తీర్ణుల్ని చేస్తూ ఈనెల 3న ప్రభుత్వం జీవో 205 విడుదల చేసింది. తాజా జీవోల ప్రకారం అర్హత సాధించిన వారితో పాటు గతంలో హాజరుకాలేక పోయిన వారు ఈనెల 8న ధ్రువపత్రాల పరిశీలనకు హాజరు కావచ్చునని కన్వీనర్ తెలిపారు.

ఈనెల 9 వరకు వెబ్​ఆప్షన్ల నమోదుకు అవకాశం ఉంటుందని, ఈనెల 12న సీట్లు కేటాయించనున్నట్లు పేర్కొన్నారు. మొదటి విడతలో వచ్చిన సీటు రద్దు చేసుకునేందుకు ఈనెల 9 వరకు గడువు ఉంటుందన్నారు. ప్రైవేట్ కళాశాలల్లో స్పాట్ అడ్మిషన్ల కోసం ఈనెల 14న మార్గదర్శకాలు జారీ చేయనున్నారు.

ఇదీ చదవండి:రాష్ట్ర చరిత్రలో అతిపెద్ద విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు

ABOUT THE AUTHOR

...view details