హైదరాబాద్‌లో మరో జాతీయ స్థాయి నైపుణ్యాభివృద్ధి సంస్థ రాబోతోంది. లాల్ బహదూర్ శాస్త్రి నైపుణ్యాభివృద్ధి సంస్థను హైదరాబాద్‌లో ఏర్పాటు చేసేందుకు ట్రస్టు ముందుకొచ్చింది. మాజీ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి పేరిట ఆయన కుమారుడు అనిల్ శాస్త్రి నిర్వహిస్తోన్న ట్రస్టు దీనిని ఏర్పాటు చేయనుంది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్, రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్ కుమార్‌తో అనిల్ శాస్త్రి సమావేశమయ్యారు.
SKILL DEVELOPMENT CENTER: హైదరాబాద్‌లో మరో జాతీయ స్థాయి నైపుణ్యాభివృద్ధి సంస్థ - hyderabad district latest news
హైదరాబాద్‌లో మరో జాతీయ స్థాయి నైపుణ్యాభివృద్ధి సంస్థ రాబోతోంది. మాజీ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి పేరిట ఆయన కుమారుడు అనిల్ శాస్త్రి నిర్వహిస్తోన్న ట్రస్టు దీనిని ఏర్పాటు చేయనుంది. ట్రస్టు నిర్ణయం పట్ల హర్షం సీఎస్ సోమేశ్‌కుమార్ హర్షం వ్యక్తం చేశారు. ప్రభుత్వపరంగా అన్ని విధాలా సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు.

ఈ సందర్భంగా రాష్ట్ర విద్యార్థులు, యువతకు నైపుణ్య అభివృద్ధిలో శిక్షణ ఇవ్వడమే కాక.. వివిధ కోర్సులను అందించనున్నట్లు అనిల్ శాస్త్రి తెలిపారు. సింగపూర్‌లోని ప్రతిష్ఠాత్మక ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ (ఐటీఈ) సంయుక్త నిర్వహణలో హైదరాబాద్ కేంద్రంగా లాల్ బహదూర్ శాస్త్రి జాతీయ నైపుణ్యాభివృద్ధి సంస్థ పని చేస్తుందని ట్రస్టు డైరెక్టర్ శ్రీవాత్సవ వెల్లడించారు. లాల్ బహదూర్ శాస్త్రి ట్రస్టు నిర్ణయం పట్ల హర్షం సీఎస్ సోమేశ్‌కుమార్ హర్షం వ్యక్తం చేశారు. ప్రభుత్వపరంగా అన్ని విధాలా సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు.
ఇదీ చూడండి: KTR: 'నాన్న నన్ను ఐఏఎస్ చేయాలనుకున్నారు... కానీ నేనేమి చేశానంటే..'