ఎలక్ట్రానిక్ వాహనాల రంగంలో రాష్ట్రానికి మరో భారీ పెట్టుబడి రానుంది. ఈవీ రంగంలో దిగ్గజ కంపెనీగా పేరొందిన ట్రైటాన్(triton) ఈవీ, తెలంగాణలో భారీగా పెట్టుబడులు పెట్టేందుకు ప్రభుత్వంతో ఇవాళ.. అవగాహన ఒప్పందాన్ని కుదుర్చుకుంది. ఈ మేరకు రాష్ట్రంలో సూమారు రూ. 2,100 కోట్ల పెట్టుబడి పెట్టేందుకు తన సంసిద్ధతను వ్యక్తం చేసింది.
ఎలక్ట్రానిక్ వాహనాల రంగంలో రాష్ట్రానికి మరో భారీ పెట్టుబడి - జహీరాబాద్ నిమ్జ్‌లో ట్రైటాన్ పరిశ్రమ
17:55 June 24
ఎలక్ట్రానిక్ వాహనాల రంగంలో రాష్ట్రానికి మరో భారీ పెట్టుబడి
ప్రగతి భవన్లో ఇవాళ జరిగిన సమావేశంలో పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌తో సమావేశమై.. తమ పెట్టుబడి ప్రణాళికను వివరించింది. భవిష్యత్తులో భారీగా డిమాండ్ ఉండే ఈవీ రంగాన్ని పెద్ద ఎత్తున విస్తరించేందుకు తమ కంపెనీ ఇప్పటికే ప్రణాళికలతో సిద్ధంగా ఉందని మంత్రి కేటీఆర్‌కు ట్రైటాన్ ఈవీకు తెలిపింది.
భారత్‌లో తయారీ ప్లాంట్‌ని ఏర్పాటు చేసేందుకు వివిధ రాష్ట్రాల్లో ఉన్న అవకాశాలను పరిశీలించిన తర్వాత తెలంగాణ కేంద్రంగా తమ కార్యకలాపాలను ముందుకు తీసుకుపోయేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు కంపెనీ సీఈవో హిమాన్షు పటేల్... కేటీఆర్‌కు తెలిపారు. పెట్టుబడుల విషయంలో తెలంగాణకు ఉన్న అవకాశాలను దృష్టిలో ఉంచుకుని పెట్టుబడి పెట్టేందుకు సిద్ధంగా ఉన్నామని ప్రకటించారు. ఈ మేరకు జహీరాబాద్ నిమ్జ్‌లో తయారీ యూనిట్ ఏర్పాటుకు సుముఖంగా ఉన్నామని ఆయన పేర్కొన్నారు.
ఇదీచూడండి:ఈ రాత్రికి చంద్రుడు ఎంత ప్రత్యేకంగా కనిపిస్తాడో తెలుసా?