ఏపీ రాజధాని ఉద్యమంలో మరో రైతు ప్రాణాలు కోల్పోయారు. గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం వెలగపూడి గ్రామానికి చెందిన సుబ్బారావు ఈ ఉదయం గుండెపోటుతో మృతి చెందారు. సుబ్బారావు గత నాలుగు రోజులుగా అమరావతి ఉద్యమంలో చురుకుగా పాల్గొంటున్నారు. రాజధాని నిర్మాణం కోసం ఎకరా 18 సెంట్లు భూమిని ప్రభుత్వానికి ఇచ్చారు. రైతు మృతి పై రాజధాని పరిరక్షణ ఐకాస నాయకులు సంతాపం ప్రకటించారు.
అమరావతి కోసం ఆగిన మరో రైతు గుండె - అమరావతి రైతుల మరణాలు
రాజధాని అమరావతి కోసం మరో రైతు గుండె ఆగింది. ఏపీలోని గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం వెలగపూడి గ్రామానికి చెందిన సుబ్బారావు ఈ ఉదయం గుండెపోటుతో మరణించారు. రైతు మృతి పై రాజధాని పరిరక్షణ ఐకాస నాయకులు సంతాపం తెలిపారు.

అమరావతి కోసం ఆగిన మరో రైతు గుండె