క్యాన్సర్ బాధితులకు మరింత మెరుగైన చికిత్సను అందించేందుకు బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ ఆసుపత్రి మరో అడుగు ముందుకేసింది. అమెరికా నుంచి రోగులకు శస్త్రచికిత్స, నిర్ధరణ పరీక్షల సమయంలో వినియోగించే స్టెరిలైజేషన్ యంత్రాన్ని దిగుమతి చేసుకుంది. అత్యాధునిక పరిజ్ఞానంతో పనిచేసే ఈ యంత్రాన్ని ఆసుపత్రి ఛైర్మన్ నందమూరి బాలకృష్ణ ఇవాళ ప్రారంభించారు.
Basavatarakam hospital: బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రిలో మరో సదుపాయం - స్టెరిలైజేషన్ యంత్రం
బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ ఆసుపత్రి.. బాధితుల చికిత్స కోసం మరో అడుగు ముందుకేసింది. అమెరికా నుంచి రోగులకు శస్త్రచికిత్స, నిర్ధరణ పరీక్షల సమయంలో వినియోగించే ఓ యంత్రాన్ని దిగుమతి చేసుకుంది. తెలుగు రాష్ట్రాల్లో మొట్టమొదటి సారిగా ఇలాంటి యంత్రం బసవతారకం ఆసుపత్రిలోనే అందుబాటులోకి రావటం పట్ల.. ఛైర్మన్ నందమూరి బాలకృష్ణ హర్షం వ్యక్తం చేశారు.
రూ. కోటికి పైగా విలువ కలిగిన ఈ యంత్రంతో అతి తక్కువ సమయంలోనే చికిత్సకు వినియోగించే పరికరాలను శుభ్రపరచవచ్చునని వైద్యులు తెలిపారు. ఈ యంత్రం.. వైద్య పరికరాల నుంచి 99.9 శాతం వరకు సూక్ష్మ అవాంచిత కణాలను తొలగించగలదని వారు వివరించారు. ఫలితంగా రోగులకు ఇన్ ఫెక్షన్లు సోకకుండా కాపోడుకోవచ్చునని అన్నారు. తెలుగు రాష్ట్రాల్లో మొట్టమొదటి సారిగా ఇలాంటి స్టెరిలైజేషన్ యంత్రం బసవతారకం ఆసుపత్రిలోనే అందుబాటులోకి రావటం పట్ల ఛైర్మన్ నందమూరి బాలకృష్ణ హర్షం వ్యక్తం చేశారు.
ఇదీ చదవండి:రాష్ట్రంలో 97.24 శాతానికి చేరిన కరోనా రికవరీ రేటు