పోలీసుల అదుపులో మరో ఇద్దరు డ్రగ్ స్మగ్లర్లు - Hyderabad police arrests drug dealer mohit
10:27 January 02
హైదరాబాద్ నార్కోటిక్ విభాగం పోలీసుల అదుపులో మరో ఇద్దరు స్మగ్లర్లు
Hyderabad Police arrested two drug smugglers : నూతన సంవత్సర వేడుకల సందర్భంగా ప్రత్యక తనిఖీల్లో డ్రగ్సd కేసులో పాత నేరస్థులు పట్టుబడ్డారు. రాంగోపాల్ పేట్‌లో నవంబర్ 3న నమోదైన కేసు కేసులో మోహిత్ అగర్వాల్ అలియాస్ మైరాన్ మోహిత్, మన్యం కృష్ణకిశోర్ రెడ్డి పరారీలో ఉన్నారు. హైదరాబాద్ నార్కొటిక్స్ ఎన్ఫోర్స్‌మెంట్ వింగ్ పోలీసులతో కలిసి రాంగోపాల్ పేట్ పోలీసులు తాజాగా ఈ ఇద్దరిని అరెస్ట్ చేశారు. ఇద్దరి నుంచి 3గ్రాముల కొకైన్, రెండు చరవాణులు స్వాధీనం చేసుకున్నారు.
ఇంటర్నేషనల్ డీజే ఈవెంట్లు నిర్వహిస్తున్న మోహిత్ అగర్వాల్.. ముంబయి, గోవా, హైదరాబాద్, బెంగళూరులో పార్టీలు నిర్వహిస్తుంటాడు. హైదరాబాద్‌లోని పబ్‌లలోనూ ప్రైవేట్ పార్టీలు నిర్వహిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ కేసు దర్యాప్తులో 50కి పైగా సరఫరాదార్లతో మోహిత్‌కు లింకులు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. పార్టీలు నిర్వహిస్తూ కొకైన్‌కు బానిసగా మారిన మోహిత్ పలువురికి డ్రగ్స సరఫరా చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. డ్రగ్స్ లో కీలక నిందితుడు ఎడ్విన్‌తో కూడా మోహిత్ కు సంబంధాలు ఉన్నట్లు వెల్లడించారు.
మరోవైపు మన్యం కృష్ణకిశోర్ రెడ్డి కేఎంసీ ప్రై.లి. నడుపుతున్నట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. పబ్‌లలో స్నేహితులకు పార్టీలు నిర్వహిస్తున్న కిశోర్.. డ్రగ్స్ కోసం తరచూ గోవా వెళ్లివస్తున్నట్లు గుర్తించారు. ఇతడికి డ్రగ్స్ కేసులో కీలక నిందితుడు ఎడ్విన్‌తో పరిచయం ఉన్నట్లు పోలీసులు తెలిపారు. బెంగళూరు నుంచి హైదరాబాద్‌కు ఓ వ్యక్తి ద్వారా కృష్ణకిశోర్‌కు డ్రగ్స్ చేరుతున్నట్లు వెల్లడించారు. ఆదివారం రోజున బంజారాహిల్స్‌లో కృష్ణకిశోర్ రెడ్డిని అరెస్టు చేసినట్లు చెప్పారు. అతడి నుంచి 2గ్రాములు కొకైన్ స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు.