Another DA to TSRTC Employees : టీఎస్ఆర్టీసీ తమ ఉద్యోగులకు గుడ్న్యూస్ చెప్పింది. ఆ సంస్థలో పని చేస్తున్న ఉద్యోగులకు మరో విడత కరవుభత్యం(డీఏ) ఇవ్వాలని తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ నిర్ణయించింది. ఈ ఏడాది జనవరి నుంచి ఇవ్వాల్సి ఉన్న 5 శాతం డీఏను సిబ్బందికి మంజూరు చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ సెప్టెంబర్ నెల వేతనంతో కలిపి కరవుభత్యాన్ని టీఎస్ఆర్టీసీ చెల్లించనుంది. పెండింగ్లో ఉన్న ఎనిమిదవ డీఏను ఉద్యోగులకు మంజూరు చేయాలని తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ నిర్ణయం తీసుకుంది. క్లిష్ట పరిస్థితుల్లోనూ ఇప్పటి వరకు 8డీఏలను మంజూరు చేసింది. సంస్థను లాభాల్లోకి తీసుకెళ్లేందుకు ఆర్టీసీ ఉద్యోగులు కష్టపడి పని చేస్తున్నారని టీఎస్ఆర్టీసీ ఛైర్మన్ బాజిరెడ్డి గోవర్దన్ తెలిపారు.
TSRTC MD sajjanar interview : 'ప్రయాణికులకు దగ్గరవ్వడమే మా ప్రధాన లక్ష్యం'
తెలంగాణఆర్టీసీ సంస్థ ఎండీగా వీసీసజ్జనార్ బాధ్యతలు చేపట్టిన తరువాత ఆ సంస్థలో విప్లవాత్మక సంస్కరణలు తీసుకువచ్చారు. ముఖ్యంగా సంస్థ ఆదాయాన్ని పెంచడానికి ఏం చేయాలనే దానిపై ఆయన కృషి చేశారు. అదే విధంగా సంస్థలో పని చేస్తున్న ఉద్యోగులకు కూడా ఉద్యోగ భద్రత కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. టీఎస్ఆర్టీసీలో ఆక్యుపెన్సీ రేటు పెంచడం, రద్దీ ఉండే రూట్లలో బస్సులు ఎక్కువగా పెంచడం వంటివి చేస్తున్నారు. తాజాగా రాఖీ పౌర్ణమి సందర్భంగా తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ తీసుకున్న నిర్ణయం సత్ఫలితాలను ఇచ్చింది. ఆర్టీసీకి కాసుల వర్షం కురిపించింది.