హైదరాబాద్ యూసుఫ్‌గూడ విద్యుత్ శాఖలో పనిచేస్తున్న ఓ అధికారి ఏసీబీ వలలో చిక్కాడు. కొత్తగా నిర్మించిన భవనంలో ప్యానల్ బోర్డు పెట్టుకోవడానికి 35వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు వలపన్ని పట్టుకున్నారు. రమేష్ అనే వ్యక్తి కొత్తగా నిర్మించుకున్న భవనానికి విద్యుత్ మీటరు బిగించేందుకు రూ.80 వేల రూపాయలు డిమాండ్ చేశారు. మొదటి విడతగా 35 వేలు తీసుకుంటుండగా అనిశా అధికారులు పట్టుకున్నారు.
ఏసీబీ వలలో మరో అవినీతి చేప
హైదరాబాద్‌లో ఓ అవినీతి అధికారి బాగోతం బయటపడింది. ఓ వ్యక్తి నుంచి 35 వేలు లంచం తీసుకుంటూ యూసఫ్‌గూడ ట్రాన్స్‌కో ఏఈ సుధాకర్ అవినీతి నిరోధక శాఖ అధికారులకు చిక్కాడు.
ఏసీబీ వలలో మరో అవినీతి చేప