తెలంగాణ

telangana

By

Published : Feb 14, 2020, 7:28 PM IST

ETV Bharat / state

గాంధీలో మరో వివాదం

గాంధీ ఆస్పత్రిలో మరో వివాదం చోటు చేసుకుంది. ఇప్పటికే వైద్య విద్యార్థుల ఇంటర్న్​షిప్​కి సంబంధించి విధులకు హాజరుకాకుండానే సర్టిఫికెట్​ కొనుక్కుంటున్నారన్న ఆరోపణల నేపథ్యంలో... ఇవాళ ఆస్పత్రిలో చోటుచేసుకున్న పరిణామాలు మరిన్ని అనుమానాలు రేకెత్తిస్తున్నాయి.

gandhi hospital
గాంధీలో మరో వివాదం

గాంధీ ఆస్పత్రిలో మరో వివాదం చోటుచేసుకుంది. గాంధీ ఆస్పత్రి అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్​లోని ఓ గదిలో... అటెండర్ సహా మరో ఇద్దరు సిబ్బంది.. 2017 నుంచి ఇప్పటివరకు ఇంటర్న్​షిప్ పూర్తి చేసిన వారి దస్త్రాలను పరిశీలిస్తుండటం అనుమానాలు రేకెత్తిస్తోంది. స్టోర్​రూమ్ లోపలి నుంచి గడియపెట్టుకుని... ఈ పనులను చేస్తుండటం పట్ల విమర్శలు వెల్లువెత్తాయి. ఇప్పటికే గాంధీలో ఇంటర్న్​షిప్ స్కామ్ జరుగుతోందని ఆస్పత్రి నుంచి సరెండర్ అయిన వైద్యుడు వసంత్ ఆరోపించారు.

ఈ నేపథ్యంలో స్పందించిన ఆస్పత్రి సూపరింటెండెంట్ ఇవాళ డీఎంఈకి పూర్తి వివరాలతో కూడిన నివేదిక ఇవ్వనున్నట్టు పేర్కొన్నారు. మరోవైపు వైద్య శాఖ అధికారులు లేకుండానే దస్త్రాలను తీసి పరిశీలిస్తుండటం అనుమానాస్పదంగా మారింది.

ఇదీ చూడండి: 'గాంధీ ఆస్పత్రిలో అంతా సవ్యంగానే ఉంది'

ABOUT THE AUTHOR

...view details