Case against MLA Raja Singh : గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్‌పై మరో కేసు నమోదైంది. మంగళహాట్ పీఎస్‌లో రాజాసింగ్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ నెల 6న తన ట్విటర్ ఖాతాలో అయోధ్యపై రాజాసింగ్ పోస్ట్ చేశారు. ఈ వివాదాస్పద వ్యాఖ్యలపై సంజాయిషీ ఇవ్వాలని మంగళహాట్ పోలీసులు నోటీసులు జారీ చేశారు. పీడీ యాక్ట్ కొట్టేస్తూ హైకోర్టు విధించిన షరతులను ఉల్లంఘించారని అందులో పేర్కొన్నారు. ఈ నోటీసులకు రాజాసింగ్ తరఫు న్యాయవాది సంజాయిషీ ఇచ్చారు.
ఎమ్మెల్యే రాజాసింగ్‌పై మరో కేసు నమోదు - Hyderabad Latest News
06:09 December 09
బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌పై మరో కేసు
సంజాయిషీలో పేర్కొన్న అంశాలు సంతృప్తికరంగా లేవని పోలీసులు పేర్కొన్నారు. 295-ఏ ఐపీసీ సెక్షన్ కింద మంగళహాట్ పోలీసులు కేసు నమోదు చేశారు. తనపై కేసు నమోదు చేయడంపై రాజాసింగ్ స్పందించారు. బాబ్రీ మసీదుపై ఒవైసీ సోదరులు సైతం వివాదాస్పద వ్యాఖ్యలు చేశారన్న రాజాసింగ్.. వాళ్లపై ఎందుకు కేసు నమోదు చేయలేదని ప్రశ్నించారు. సీఎం కేసీఆర్, ఒవైసీ సోదరుల మెప్పు పొందేందుకు.. పోలీసులు పోటీపడి తనపై కేసులు నమోదు చేస్తున్నారని రాజాసింగ్ ఆరోపించారు.
ఇవీ చదవండి:ఎక్స్‌ప్రెస్ మెట్రోకు శంకుస్థాపన చేసే అర్హత కేసీఆర్‌కు లేదు: కిషన్‌రెడ్డి