తెలంగాణ

telangana

ETV Bharat / state

ఎమ్మెల్యేల ఎర కేసులో ప్రధాన నిందితుడు రామచంద్ర భారతిపై మరో కేసు - ఎమ్మెల్యేలకు ఎర కేసులో ప్రధాన నిందితుడిపై మరో కేసు

Another case against Ramachandra Bharati: ఎమ్మెల్యేల ఎర కేసులో ప్రధాన నిందితుడు రామచంద్ర భారతిపై బంజారాహిల్స్ పీఎస్‌లో మరో కేసు నమోదైంది. నకిలీ ఆధార్, పాన్ కార్డు, డ్రైవింగ్ లైసెన్సు తయారు చేశారంటూ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ నకిలీ ధ్రువపత్రాలతో ఎక్కడెక్కడ మోసాలకు పాల్పడ్డారనే కోణంలోనూ ఆరా తీస్తున్నారు.

Ramachandra Bharti
Ramachandra Bharti

By

Published : Nov 8, 2022, 7:05 PM IST

Updated : Nov 8, 2022, 7:49 PM IST

Another case against Ramachandra Bharati: తెరాస ఎమ్మెల్యేలకు ఎర కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న రామచంద్ర భారతిపై మరో కేసు నమోదైంది. నకిలీ ఆధార్ కార్డు, పాన్ కార్డు, డ్రైవింగ్ లైసెన్సు కలిగి ఉన్నాడని.. బంజారాహిల్స్ పోలీసులు రాంచంద్ర భారతిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. రెండు రోజుల క్రితం తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఈ కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.

గత నెల 26న రామచంద్ర భారతితో పాటు మరో ఇద్దరిపై మొయినాబాద్ పోలీస్ స్టేషన్​లో కేసు నమోదైంది. ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు ప్రయత్నించారని రోహిత్ రెడ్డి ఇచ్చిన ఫిర్యాదుతో మొయినాబాద్ పోలీసులు అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ 8తో పాటు... పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి అరెస్ట్ చేసి రిమాండ్​కు తరలించారు. దిల్లీకి చెందిన రామచంద్ర భారతి అలియాస్ సతీష్ శర్మ ఈ కేసులో కీలక భూమిక పోషించినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది.

హైదరాబాద్​కు చెందిన నందకుమార్ సాయంతో పైలెట్ రోహిత్ రెడ్డిని పరిచయం చేసుకొని ఆయన ద్వారా తెరాసకు చెందిన నలుగురు ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు ప్రయత్నించారని పోలీసులు ఎఫ్ఐఆర్​లో పేర్కొన్నారు. ఈ నెల 3వ తేదీన సీఎం కేసీఆర్ విలేకరుల సమావేశంలోనూ రామచంద్ర భారతి మోసాలకు పాల్పడుతున్నాడని ఆరోపించారు. నకిలీ ఆధార్, పాన్ కార్డు, డ్రైవింగ్ లైసెన్సుల గురించి ప్రస్తావించారు. రెండు రోజుల క్రితం పైలెట్ రోహిత్ రెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నకిలీ ధ్రువపత్రాలకు సంబంధించి పూర్తి ఆధారాలు సేకరిస్తున్నారు. ఈ నకిలీ ధ్రువపత్రాలతో ఎక్కడెక్కడ మోసాలకు పాల్పడ్డారనే కోణంలోనూ ఆరా తీస్తున్నారు.

ఇవీ చదవండి:

Last Updated : Nov 8, 2022, 7:49 PM IST

ABOUT THE AUTHOR

...view details