తెలంగాణ

telangana

ETV Bharat / state

మరో 8 మంది ఇండోనేసియా వాసుల గుర్తింపు.. ఫివర్​ ఆసుపత్రికి తరలింపు

కరీంనగర్‌లో పర్యటించిన ఇండోనేసియా వాసులు 10 మందిలో 8 మందికి కరోనా లక్షణాలు ఉన్నట్లు బయటపడిన విషయం తెలిసిందే. అయితే హైదరాబాద్​ మల్లేపల్లిలో కూడా మరో 8 మంది ఇండోనేసియా వాసులను గుర్తించారు. వారిని ఫివర్​ ఆసుపత్రికి తరలించారు.

Another 8 are Indonesians in Mallepally Hyderabad
మల్లేపల్లిలో మరో 8 మంది ఇండోనేసియా వాసులు

By

Published : Mar 20, 2020, 8:20 AM IST

హైదరాబాద్‌ మల్లేపల్లి ప్రాంతంలో మరో 8 మంది ఇండోనేసియా వాసులను గుర్తించారు. వారిని వైద్యపరీక్షల కోసం ఫీవర్‌ ఆసుపత్రికి తరలించారు. కరీంనగర్‌లో పర్యటించిన 10 మందిలో 8 మందికి కరోనా లక్షణాలు ఉన్నట్లు బయటపడిన విషయం విదితమే. వీరికన్నా ముందే ఫిబ్రవరి 17న ఇండోనేసియా నుంచి ఎనిమిది మంది (4 జంటలు) దిల్లీకి వచ్చారు. 24న జగిత్యాలకు చేరుకున్నారు. అక్కడ కొన్ని రోజుల పాటు ఉన్న వీరు ఈ నెల 8న కోరుట్లకు వెళ్లారు.

బుధవారం రాత్రి కోరుట్ల నుంచి నగరానికి వచ్చారు. నలుగురు పురుషులు మల్లేపల్లి బడీ మసీదులో ఉండగా, మహిళలు సమీపంలోని ఓ అపార్టుమెంట్‌లో ఆశ్రయం పొందారు. ఇండోనేసియాకు చెందిన 8 మంది మల్లేపల్లి ప్రాంతంలో ఉన్నట్లు కరీంనగర్‌ పోలీసులు, నగర పోలీసులకు సమాచారం అందించారు. దాంతో పోలీసులు, వైద్యాధికారులు గురువారం రాత్రి 8 గంటల ప్రాంతంలో మల్లేపల్లిలో వీరున్న అపార్ట్‌మెంట్‌కు చేరుకుని వివరాలు తెలుసుకున్నారు. డా.రాజ్‌కుమార్‌ బృందం వీరికి వైద్య పరీక్షలు జరిపింది. ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేవని గుర్తించి మాస్కులు అందించారు. అనంతరం రెండు 108 వాహనాల్లో ఫీవర్‌ ఆస్పత్రికి తరలించారు.

ఇదీ చదవండి:కరోనా ఎఫెక్ట్: నిర్మానుష్యంగా మారిన కరీంనగర్

ABOUT THE AUTHOR

...view details